Home » మనం రోజూ వాడే పసుపు అసలుదా? నకిలీదా? అని ఎలా తెలుస్తుంది?

మనం రోజూ వాడే పసుపు అసలుదా? నకిలీదా? అని ఎలా తెలుస్తుంది?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మనం ప్రతి రోజు చేసే వంటలో కచ్చితంగా పసుపు ఉపయోగిస్తాము. మనం వాడేది చిటికెడే అయినా.. దాని ప్రభావం సువాసనలో తెలుస్తూ ఉంటుంది. చాలా మంది పసుపుని బయట కొనేస్తూ ఉంటారు. కానీ, కొంతమంది మాత్రం పసుపు కొమ్ములను కొనుక్కుని వాటిని పసుపుగా కొట్టించుకుంటూ ఉంటారు. ఇటువంటి పసుపు వలన ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, బయట పసుపు కొనే వారు మాత్రం కొన్ని విషయాలను పట్టించుకోవాలి. మనం వాడే పసుపు అసలు పసుపేనా? లేక నకిలీదా అన్న సంగతి తెలుసుకోవాలి.

Advertisement

ప్రస్తుతం మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువు నకిలీదే అయి ఉంటోంది. ఈ పరిస్థితులలో మనం కొనుక్కునే పసుపు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిట్కాతో మనం వాడే పసుపు అసలుదా? నకిలీదా? అన్న సంగతి తెలిసిపోతుంది. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి, నీరు కలపాలి. దీనిలో కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. అప్పుడు బుడగలు వస్తే ఆ పసుపులో సబ్బు లేదా సుద్ద పొడి కలిపారని అర్ధం అవుతుంది.

Advertisement

అలాగే మరొక గ్లాస్ తీసుకుని అందులో గోరు వెచ్చని నీటిలో చెంచా పసుపు వేయాలి. దానిని కదపకుండా అలానే అరగంట వదిలేస్తే ఆ పసుపు అంత గ్లాస్ కి అంటకుండా అడుగుకు చేరిపోయి నీరు స్వచంగా కనిపిస్తే ఆ పసుపు స్వచ్ఛమైన పసుపు అని అర్ధం. కానీ ఆ గ్లాసు లో నీరు మబ్బుగా మారినట్లు అనిపిస్తే మాత్రం ఆ పసుపు కల్తీ పసుపు అని అర్ధం. కాబట్టి.. మీరు వాడుతున్న పసుపుని కూడా టెస్ట్ చేసుకుని చూడండి. ఒకవేళ కల్తీ పసుపు అని అనిపిస్తే.. పసుపు కొమ్ములను పొడి కొట్టించుకుని వాడుకోవడమే మంచిది.

మరిన్ని..

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading