Home » మరో వెయ్యేళ్ళు పాటు భూకంపాలు, వరదలకు తట్టుకునేలా రామ మందిరాన్ని ఎలా నిర్మించారో తెలుసా ?

మరో వెయ్యేళ్ళు పాటు భూకంపాలు, వరదలకు తట్టుకునేలా రామ మందిరాన్ని ఎలా నిర్మించారో తెలుసా ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

అయోధ్యలోని రామ మందిరం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతోంది. విగ్రహ ప్రతిష్ట వేడుక పూర్తి అయ్యిన తరువాత నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. రాముడికి అంకితం చేయబడిన ఈ ఆలయం భారతదేశంలో ఆధ్యాత్మికతకు కొత్త కేంద్రంగా మారనుంది. ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సామాజిక-రాజకీయ కోణంలో కూడా చాలా ప్రాధాన్యతని కలిగి ఉంది. ప్రపంచం నలుమూలల నుండి సహాయంతో, రామ మందిర నిర్మాణం ఓ పవిత్ర యజ్ఞంలా జరిగింది. నెలల తరబడి జాగ్రత్తగా ప్లాన్ చేసిన తర్వాత, నేటి రామమందిరం మన కళ్ళ ముందు ఉంది.

modi

Advertisement

 

దాదాపు ఏడు వేల మందిని విగ్రహ ప్రతిష్ట వేడుకకు ఆహ్వానించారు. రిలో దాదాపు 3,000 మంది VIPలు (రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధికారులు, ప్రముఖులు మరియు క్రికెట్ ఆటగాళ్ళు) ఉన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి సాధారణ భక్తులను కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అయోధ్య రామాలయం కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు. ఆధునిక విజ్ఞానంతో జాగ్రత్తగా రూపొందించిన ఆలయ నిర్మాణం 1000 సంవత్సరాల మన్నికని కలిగి ఉంది.

Advertisement

టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ దర్శకత్వంలో లార్సెన్ & టూబ్రో సంస్థ రామ మందిరాన్ని నిర్మించింది. ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతం, ఇది కేవలం భూకంప ఒత్తిడి మరియు వరదలను తట్టుకోవడానికి మాత్రమే కాకుండా సహస్రాబ్ది వరకు ఉండేలా నిర్మించబడింది. దాని నిర్మాణం యొక్క సూక్ష్మ అంశాలను పరిశీలిస్తే సృజనాత్మక పద్ధతులు ఎంత జాగ్రత్తగా ఉపయోగించారో తెలుస్తుంది. పాత నగారా నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొందిన ఈ ఆలయం, 360-స్తంభాల నిర్మాణం ద్వారా నిర్మించబడింది. ఇవన్నీ సిమెంట్, ఇనుము లేదా ఉక్కు వంటి ఆధునిక పదార్థాలకు విరుద్ధంగా రాతితో తయారు చేయబడ్డాయి. మన్నికను దృష్టిలో ఉంచుకుని భూకంప నిరోధకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే రాతిని ఎంచుకున్నారు. ఇది 6.5 తీవ్రతతో భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడింది. అందువల్ల, ఇది 1,000 సంవత్సరాల పాటు ఎటువంటి మెయింటెనెన్స్ లేకున్నా తట్టుకుని ఉంటుందట. చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సలహా మేరకు ఇంజనీర్లు పదిహేను మీటర్ల కొత్త మట్టిని తవ్వి తిరిగి వేరే మట్టితో భర్తీ చేశారట. మట్టి 14 రోజుల్లో రాయిగా ఘనీభవించగలదు, నిర్మాణ ప్రక్రియలో 47 సార్లు చాలా జాగ్రత్తగా పొరలు వేసారట. ఈ నిర్మాణానికి CISR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (రూర్కీ)లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) డైరెక్టర్ ప్రశంసలు అందుకున్నారు.

Visitors Are Also Reading