Home » అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

by Bunty
Ad

ప్రతి మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అనేవి చేయడం చాలా సహజం. మతాలవారీగా ఈ అంతక్రియల ప్రక్రియ కొనసాగుతుంది. హిందూ మతం ఒక రకంగా అలాగే ఇస్లాం మతం మరోరకంగా, క్రైస్తవులు వారి పద్ధతులలో అంతక్రియలు నిర్వహిస్తారు. అయితే హిందూమతంలో, జరిగే అంత్యక్రియలకు, చాలా వ్యత్యాసం ఉంటుంది.అంత్యక్రియలో కుండలో నీళ్లు పోసి రంధ్రాలు పెడతారు ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అలా ఎందుకు రంద్రాలు పెడతారు అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. మరి ఎందుకు ఆ కుండను పగలగొడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అంత్యక్రియలో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందరూ ఒకటి చితి చుట్టూ కుండతో ప్రదక్షిణం చేయడం, కుండకు రంధ్రాలు చేయడం. ఇలా ఎందుకు చేస్తారో అనేది చాలామందికి తెలియదు. ఇలా చేయడం వెనక పూర్వీకుల ముందు చూపు ఉంటుంది. చనిపోయిన వ్యక్తులు పిల్లలైనా, పెద్దలైనా సరే వాళ్ళను పితృదేవతలుగా భావిస్తారు. ప్రదక్షిణం చేయడమంటే వారిని దేవతలుగా భావించి, భక్తి గౌరవాలు వెల్లడించడం. స్మశానంలో మాత్రమే కాకుండా ఇంటి వద్ద శవాన్ని తీసుకువెళ్లే ముందు బంధువులు, సన్నిహితులు, అక్కడికి వచ్చిన వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.

Advertisement

అప్పుడు పూలు గాని, పూలమాలలు గాని వేసి భక్తి భావాలు ప్రదర్శిస్తారు. చితి చుట్టూ కుండతో ప్రదక్షిణ చేసి కుండకు రంద్రాలు, చేసి నీరు వదలడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మన జీవితం కూడా చిల్లులకుండ అనే తాత్విక సందేశం ఇస్తారు. అలాగే దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. మన స్మశానాలు ఎక్కువగా చెత్త చెదారంతో ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల దట్టమైన పొదలు, చెట్లు ఉండటంతో మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల స్మశానాలు, గడ్డివాములు, పశువుల పాకలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కపాల మోక్షం కలిగిన వెంటనే వచ్చిన వాళ్లు ఇళ్లకు వెళ్తారు. అప్పుడు మంటలు విస్తరిస్తే అగ్నిప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చితి చుట్టూ నీరు జల్లడంతో అగ్ని ప్రమాదం కట్టడి చేయవచ్చు. అందుకే పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారని అంటూ ఉంటారు.

read also : ప్రభాస్ ఆ 21 కోట్ల అప్పు ఎందుకు చేశాడో తెలుసా?

Visitors Are Also Reading