Home » ఎన్టీఆర్ నుండి ధ‌నుష్ వ‌ర‌కూ…సినిమాల్లో సార్ లుగా న‌టించిన స్టార్స్ వీళ్లే..!

ఎన్టీఆర్ నుండి ధ‌నుష్ వ‌ర‌కూ…సినిమాల్లో సార్ లుగా న‌టించిన స్టార్స్ వీళ్లే..!

by AJAY
Ad

త‌మిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా సార్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక సినిమాలో హీరోలు టీచ‌ర్ పాత్ర‌లో న‌టించారంటే. ఆ సినిమాలు దాదాపుగా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటాయి. తెలుగులో చాలా మంది హీరోలు టీచ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ఆ హీరోలు ఎవ‌రు ఆ సినిమాలు ఏవి అన్న‌ది ఇప్పుడు చూద్దాం..

ntr-in-badi-panthulu

Advertisement

అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు బ‌డిపంతులు సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో న‌టించి అద‌ర‌గొట్టారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాలో శ్రీదేవి ఎన్టీకు మ‌న‌వరాలు పాత్ర‌లో న‌టించింది.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కూడా టీచ‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ఏఎన్ఆర్ గురు బ్ర‌హ్మ సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన బుర్రిపాలెం బుల్లోడు సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాలో కృష్ణ టీచ‌ర్ పాత్ర‌లో న‌టించారు.

Advertisement

విక్ట‌రీ వెంక‌టేష‌న్ కూడా టీచ‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. సుంద‌ర‌కాండ సినిమాలో వెంకీ టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించాడు.

మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాల్లో టీచ‌ర్ పాత్ర‌ల్లో న‌టించారు. ఠాగూర్ మ‌రియు మాస్ట‌ర్ సినిమాలో చిరు టీచర్ పాత్ర‌లో మెప్పించారు.

mirapakay

మాస్ మ‌హరాజ్ ర‌వితేజ మిర‌ప‌కాయ్ సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు.

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం టీచ‌ర్ పాత్ర‌లో న‌టించాడు. గీతాగోవిందం సినిమాలో విజ‌య్ టీచ‌ర్ పాత్ర‌లో మెప్పించాడు.

balakrishna-in-simha

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య కూడా టీచ‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. సింహా సినిమాలో బాల‌య్య టీచ‌ర్ పాత్ర‌లో అద‌ర‌గొట్టారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading