Home » హీరో మోహన్ బాబు తో సినిమాలు చేసిన ఈ హీరోయిన్స్ అందరు చనిపోయారని తెలుసా ?

హీరో మోహన్ బాబు తో సినిమాలు చేసిన ఈ హీరోయిన్స్ అందరు చనిపోయారని తెలుసా ?

by Srilakshmi Bharathi
Ad

మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు అన్న సంగతి తెలిసిందే. ప్రముఖ భారతీయ నటుడు మరియు నిర్మాత అయినా మోహన్ బాబు మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ శిక్షణ పొందారు. మోహన్ బాబు 500కు పైగా చిత్రాలలో ప్రధాన, సహాయ మరియు విభిన్న పాత్రలలో నటించారు. నిన్నటి తరం జనరేషన్ లో ఆయన స్టార్ హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే.

mohan-babu

Advertisement

విలక్షణ నటుడిగా, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు సరసన నటించిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు మరణించారు. మోహన్ బాబుతో నటించిన వారిలో చనిపోయిన వారి లిస్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి.

సుజాత:


క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుజాత మొదట్లో హీరోయిన్ గా నటించారు. ఆమె మోహన్ బాబు సరసన చాలా సినిమాల్లోనే నటించారు. వాటిల్లో బాగా పేరు తెచ్చుకున్న సినిమా “సుజాత”. ఈ సినిమాలో సుజాత మోహన్ బాబు ప్రియురాలిగా నటించారు. కవలలుగా నటించిన సుజాతకు మరో జోడిగా మురళి మోహన్ నటించారు. సుజాత 2018 లో మరణించారు. అనారోగ్య సమస్యలతో యాభై ఎనిమిది సంవత్సరాలకే కన్ను మూసారు.

ఫటా ఫట్ జయలక్ష్మి:


మోహన్ బాబు హీరోగా వచ్చిన స్వర్గం నరకం సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్ గా నటించారు. ఆమె ఇప్పుడు మనముందు లేకపోవడం బాధాకరం. అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఫటాఫట్ జయలక్ష్మి అప్పట్లో కుర్రకారుని ఉర్రుతలూగించారు. మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడైన రజినీకి ఈమె ఫేవరేట్ హీరోయిన్ అట. ఈమె 22 సంవత్సరాల వయసులో ప్రేమ వైఫల్యం వల్ల మరణించారు.

సౌందర్య:


సౌందర్య కు మోహన్ బాబు మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరి కాంబోలో కూడా చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పెదరాయుడు, పోస్ట్ మాన్, రాయుడు, అధిపతి వంటి సినిమాలు చాలానే ఉన్నాయ్. సౌందర్య ఆఖరి చిత్రం శివ శంకర్ కూడా మోహన్ బాబుతోనే. మోహన్ బాబుతో సినిమా అంటే సౌందర్య అభ్యంతరం లేకుండ డేట్స్ ఇచ్చేస్తారట. ఆమె 31 సంవత్సరాల వయసులోనే ప్రమాదవశాత్తు మరణించారు.

సిల్క్ స్మిత:


మరో హాట్ హీరోయిన్ కమ్ క్లబ్ డాన్సర్ సిల్క్ స్మిత కూడా ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు. మోహన్ బాబుతో తిరుగుబాటు అనే సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించారు. ఈమె కూడా 35 ఏళ్ల చిన్న వయసులోనే మరణించారు.

ప్రత్యుష:


మరో నటి ప్రత్యుష కూడా మోహన్ బాబు “రాయుడు” సినిమాలో నటించారు. హీరోయిన్ కాకున్నా… కానీ ఆ రేంజ్ పాత్రలో ఆమె నటించారు. ఈమె బ్రతికి ఉండుంటే మరిన్ని సినిమాలు చేసి ఉండేది. కానీ ఇరవై ఏళ్ల వయసులోనే ఆమె మరణించింది.

దివ్య భారతి:


ఈమె కూడా సౌందర్య లాగ తన ఆఖరి సినిమాను మోహన్ బాబుతోనే చేసారు. అదే చిట్టెమ్మ మొగుడు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన అసెంబ్లీ రౌడీ సినిమాతో మోహన్ బాబు క్రేజ్ పీక్స్ లో వెళ్ళింది. వీరిద్దరి కాంబో కూడా చాల హిట్ అయ్యింది. దివ్య భారతి కూడా చిన్న వయసులోనే చనిపోయిన సంగతి తెలిసిందే.

శ్రీదేవి:

Advertisement


అతిలోక సుందరి శ్రీదేవి కూడా మోహన్ బాబుతో అనేక సినిమాల్లో కలిసి నటించింది. పదహారేళ్ళ వయసు సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హిట్ ఐయ్యింది. ప్రేమాభిషేకం సినిమాలో శ్రీదేవి మోహన్ బాబు కు చెల్లిగా కూడా నటించింది. శ్రీదేవి కూడా ప్రమాదవశాత్తు మరణించిన సంగతి విదితమే.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading