సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడు టాప్ లో ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. వరుస ఫ్లాప్ లు పడితే ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు. అయితే జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. కాబట్టి కొంతమంది హీరోయిన్లు సినిమాలను వదిలేసిన తర్వాత ఉద్యోగాలు చేస్తూ జీవితంలో బిజీగా మారారు. టాలీవుడ్ లోని కొంతమంది హీరోయిన్ లు ప్రస్తుతం టాప్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ కోట్ల జీతాలు తీసుకుంటున్నారు.
Advertisement
అలా ఉద్యోగాలు చేస్తున్న హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం… హీరోయిన్ లయ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. కానీ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉంటున్న లయ ఓ టాప్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సీతారామరాజు సినిమాలో నాగార్జునకు చెల్లెలుగా నటించి అభిమానులు సంపాదించుకున్న నటి మాన్య.
Advertisement
మాయదారి మైసమ్మ పాటతో మాన్య క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సినిమాలు చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాంకింగ్ సంస్థ జెపి మోర్గాన్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. మహేష్ బాబు వంశీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన బ్యూటీ మయూరి. ఈ బ్యూటీ బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించింది.
ఇక మయూరి ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమా ఛాన్స్ లు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి శ్వేత యామిని. శ్వేతా యామిని చదువుల్లో చాలా చురుకు. అందుకే సినిమాలను వదులుకుని ఉద్యోగం వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి నటించిన సీరియల్ పేరు తెలుసా..?