చిత్ర పరిశ్రమంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోకి చాలా కష్టపడి మెగాస్టార్గా ఎదిగాడు చిరంజీవి. తన కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసి ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. పున్నమినాగు సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. హీరో పక్కన ఉండే పాత్రలు చేసి… ఆ తర్వాత స్టార్ డమ్ తెచ్చుకున్నాడు చిరంజీవి.
Advertisement
ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 150 సినిమాలకు పైగా నటించాడు చిరు. అయితే హీరోగా అందరికీ పరిచయమైన చిరంజీవి గురించి ఒక విషయం ఎవరికీ తెలియకుండా ఉంది. మన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హిందీ సీరియల్ లో నటించారట. ఆనాటి కాలంలో బాగా హిట్ అయిన రజిని అనే బాలీవుడ్ సీరియల్స్ లో చిరు ఓ గెస్ట్ రోల్ లో కనిపించారట. ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడంతో సీరియల్స్ ను వదిలేసి చిత్ర పరిశ్రమ లోకి వచ్చి సత్తా చాటారు మెగాస్టార్ చిరంజీవి.
Advertisement
అయితే మెగాస్టార్ చిరంజీవి సీరియల్స్ లో నటించారన్న విషయం చాలామందికి తెలియదు. ఇక చిరంజీవి లాగే సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయిన నటులు చాలామంది ఉన్నారు. అందులో ట్రెండింగ్ హీరో యష్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది ?
మర్యాద రామన్న మూవీ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?
వెంకటేష్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా ?