టాలీవుడ్ లో ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతానికి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ మాత్రమే ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన నటీనటులు టెన్నీషియన్స్ కూడా రానిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు హీరోయిన్ లు సైతం రానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి నితిన్, విజయ్ దేవరకొండ హీరోలుగా మంచి సక్సెస్ అయ్యారు. ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఒకప్పటి నుండి తెలంగాణ ప్రాంతంగా నుండి అతితక్కువ మంది హీరోయిన్ లు వచ్చారు.
Advertisement
Also Read: ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని ఆసియా కప్పులు గెలిచిందో తెలుసా..?
సీనియర్ హీరోయిన్ సంగీత తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. వరంగల్ కు చెందిన సంగీత సినిమాల్లో మంచి అవకాశాలు అందుకున్నారు. హీరోయిన్ గా గుడ్ బై చెప్పిన తరవాత తల్లి పాత్రలు సైతం చేశారు. రవితేజ నటించిన ఈడియట్ సినిమాలో సంగీత తల్లిగా నటించి మెప్పించారు.
హీరోయిన్ విజయశాంతి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. వరంగల్ లో పుట్టిన విజయశాంతి చెన్నైలో చదువుకున్నారు. ఓసేయ్ రావులమ్మ, అడవిచుక్క, కర్తవ్యం, ప్రతిధ్వని లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం అక్క, వదిన పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Advertisement
తొలిప్రేమ సినిమాలో పవన్ తో జతకట్టిన హీరోయిన్ కీర్తిరెడ్డి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే.నిజామాబాద్ జిల్లాకు చెందిన కీర్తి రెడ్డి తొలిప్రేమ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ను తనవైపు తిప్పుకున్నారు ఆ తరవాత మహేశ్ బాబు అర్జున్ సినిమాలో సోదరి పాత్రలో నటించారు.
Also Read: సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న మన హీరోలు వీరే…!
ఈరోజుల్లో సినిమాతో హీరోయిన్ పరిచయమైన రేష్మా రాథోడ్ సైతం తెలంగాణలోని ఇల్లందు ప్రాంతానికి చెందినవారు. బాడీగార్డ్, లవ్ సైకిల్ సినిమాల్లో రేష్మా హీరోయిన్ గా నటించారు.
హీరోయిన్ ప్రత్యూష కూడా తెలంగాణ ప్రాంతం నుండి వచ్చారని చాలా మందికి తెలియదు. తెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో ప్రత్యూష జన్మించారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రత్యూష కలుసుకోవాలని సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడీగా నటించారు. అయితే చిన్నవయసులోనే అనుకోని కారణాల వల్ల ప్రత్యూష ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.
Also Read: అభిమాని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. ఆ తరువాత ఏం చేశారంటే..?