Home » మంగళవారం మూవీ గురించి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్..!

మంగళవారం మూవీ గురించి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్..!

by Anji
Ad

ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాలోనే బోల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఆ క్రేజ్ పాయాల్ కి  అలాగే కొనసాగలేదు. సరైన కథలు ఎంచుకోకపోవడంతో పాయల్ కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో పరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకీ మామ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు అవి అంతగా గుర్తింపు రాలేదు.


తన కెరీర్ టర్న్ తిప్పే సబ్జెక్టు కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటించారు. రాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. పాయల్ మరోసారి బో**ల్డ్ గా అదరగొట్టేసిందని కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. అలాగే విజువల్స్, టెక్నికల్ అంశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది.

Advertisement

Advertisement


మంగళవారం సినిమా హిట్ అయిన సందర్భంగా పాయల్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. దర్శకుడు అజయ్ భూపతి తనకు ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలు నటించినప్పటికీ ఆమె పాత్ర పరంగా ఆమెపై సింపతి క్రియేట్ అయ్యేలా ఉండటంతో ఆమెపై నెగటివ్ కామెంట్స్ రాలేదు. ఆమెను చూపించడానికి బోల్డ్ గా చూపించిన ఆమె క్యారెక్టర్ మాత్రం సానుభూతి పొందేలా ఉంది. దీంతో పాయల్ కి ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading