Telugu News » Blog » రంగస్థలంలో అవి చూపించాల్సి వస్తుందనే రంగమ్మత్త పాత్ర వదులుకున్నానన్న రాశి..!!

రంగస్థలంలో అవి చూపించాల్సి వస్తుందనే రంగమ్మత్త పాత్ర వదులుకున్నానన్న రాశి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగిన చాలామంది హీరోయిన్లు కొంతకాలం తెరమరుగు అయిపోయారు.. ఆ తర్వాత కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కీలకమైన పాత్రలో మెప్పిస్తున్నారు. అలాంటి కోవకే చెందిన నటి రాశి.. ఆమె తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అప్పట్లో రాశి హీరోయిన్ అంటే కుర్రకారు గుండెల్లో గుచ్చుకునేదని చెప్పవచ్చు.. అలాంటి రాశి జగపతిబాబు హీరోగా ‘శుభాకాంక్షలు’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.. అప్పట్లో సౌందర్య తర్వాత పెద్ద ఎత్తున అభిమానం సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే రాశి గుర్తుకు వచ్చేది.. ఆమె తెలుగులోనే కాకుండా సౌత్ భాషలలో తన నటనతో ఆకట్టుకుంది..

Advertisement

Advertisement

కానీ ఈమె గ్లామరస్ పాత్రలు కాకుండా ఎక్కువ కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలనే చేసేది.. అప్పట్లో రవితేజ హీరోగా వచ్చిన వెంకీ మూవీలో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేసి మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది.. గోపీచంద్ సరసన నిజం మూవీలో నెగిటివ్ షేడ్ పాత్రలో చేసి తగ్గేదే లేదు అనిపించింది.. ఇలా ఏ పాత్రలోనైనా దూరిపోయి న్యాయం చేయగల నటి రాశి.. అయితే ఈ అమ్మడు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం సినిమాలో నటించే అవకాశం వచ్చినా నో చెప్పిందట.. అందులో చాలా ఫేమస్ అయిన రంగమ్మత్త పాత్ర.. రాశి నో చెప్పడంతో అనసూయను ఓకే చేశారు..

రాశి రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే.. ఈ మూవీలో ఆ పాత్ర స్వభావం మోకాళ్ళ వరకు చీర కట్టాలి, అలాగే మందు తాగే సీన్లు చేయాలి కాబట్టి రాశి నో చెప్పిందని తానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేసింది. అలా మోకాళ్ళ దాకా చీర కట్టుకొని తొడలు కనిపించేలా పాత్ర చేయాలంటే నాకు ఇబ్బందిగా అనిపించింది అని అన్నది… అది పెద్ద సినిమా అయినా ఆ పాత్రలో నన్ను చూడాలంటే ఆడియన్స్ అంతగా ఇష్టపడరని తెలియజేసింది. కానీ ఆ పాత్ర చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేదని నా సెకండ్ ఇన్నింగ్స్ మరో విధంగా ఉండేది అని చెప్పుకొచ్చింది.. అయినా ఆ పాత్రలో అనసూయ చాలా బాగా చేసిందని మెచ్చుకుంది రాశి.

Advertisement

ALSO READ: