Telugu News » Blog » తెలంగాణ ఎస్సై అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఎన్ని మార్కుల‌కు క్వాలిఫై అంటే..?

తెలంగాణ ఎస్సై అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఎన్ని మార్కుల‌కు క్వాలిఫై అంటే..?

by Anji
Ads

తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ఎస్సై ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను ఇటీవ‌ల తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వ‌హించిన విష‌యం విధిత‌మే. దీనికి సంబంధించిన కీని ఇటీవ‌ల అధికారులు విడుద‌ల చేశారు. మొత్తం 8 ప్ర‌శ్న‌ల‌ను తొల‌గిస్తున్న‌ట్టు కీ లో పేర్కొన్నారు. అయితే ఆ ప్ర‌శ్న‌ల‌కు మార్కుల‌కు సంబంధించి క‌ల‌పనున్న‌ట్టు కీ విడుద‌ల సంద‌ర్భంగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.

Ads

ఈ ప‌రీక్ష‌ను 200 మార్కుల‌కు నిర్వ‌హించ‌గా.. ఇందులో 30 శాతం అన‌గా 60 మార్కులు సాధించిన వారు అర్హులు. అయితే ఇప్పుడు 8 ప్ర‌శ్న‌ల‌ను తొల‌గించ‌డంతో ఆ మార్కుల‌ను క‌ల‌ప‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది బోర్డు. ఇప్పుడు అర్హ‌త మార్కులెన్ని అనే అంవంపై అభ్య‌ర్థుల్లో సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ త‌రుణంలో ఆ తొల‌గించిన ప్ర‌శ్న‌ల‌ను తీసేయ‌గా మిగిలిన 52 మార్కుల‌ను సాధించిన వారంద‌రూ త‌రువాత ప‌రీక్ష‌ల‌కు అర్హులు అని బోర్డు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Ads

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో 8 ప్ర‌శ్న‌లు తొల‌గించ‌డంతో బోర్డు తీరుపై విమ‌ర్శ‌లు సైతం అభ్య‌ర్థుల ఉంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ అంశంపై సైతం బోర్డు వ‌ర్గాలు స్పందించాయి. ప‌రీక్ష‌ను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాష‌ల్లో నిర్వ‌హిస్తుండ‌డంతో ఒక భాష నుంచి మ‌రో భాష‌కు ప్ర‌శ్న‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసే స‌మ‌యంలో త‌ప్పులు దొర్లుతాయ‌ని వివ‌రించారు. ఈ త‌రుణంలో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆప్ష‌న్ల‌లో ఒక‌టి క‌న్నా ఎక్కువ స‌మాధానాలు ఉంటాయ‌ని వెల్ల‌డించ‌డం విశేషం.

Also Read : 

ఆర్ఆర్ఆర్ అని గూగుల్ లో టైప్ చేస్తే ఏం వ‌స్తుందో తెలుసా..?

Ad

నిద్ర ఎక్కువ‌గా పోతే అందంగా అవుతారా..? ఇది వాస్త‌వ‌మో కాదో తెలుసుకోండి..!