Tollywood movies: ఏదైనా సినిమా తెరమీదకి రావాలంటే అందుకోసం టీమ్ అంతా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటుంది. ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క స్టైల్ లో తీస్తూ ఉంటారు. కొత్తగా సినిమాలు వస్తే తప్ప ఆడియన్స్ చూడడానికి ఇష్టపడరు. కొన్ని కొన్ని సినిమాల్లో మనం గమనించినట్లయితే హీరో ఎలాంటి డైలాగులు చెప్పకుండా చాలావరకు సినిమా కథ నడుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పరిస్థితుల్లో అడియన్స్ డిసప్పాయింట్ అవుతుంటారు కూడా. అయితే కొంతమంది టాప్ హీరోలు ఏ డైలాగ్స్ లేకుండా సగం సినిమా వరకు కూడా నటించేసి రికార్డ్ ని సాధించారు మరి ఇక హీరోల గురించి చూద్దాం.
Advertisement
ఈ హీరోలు ఎవరో కాదండి సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు, చిరంజీవి. ఇలా ఈ ముగ్గురు హీరోలు కూడా డైలాగులు లేకుండా సినిమాని పూర్తి చేశారు. ఈ ముగ్గురు ఎంచుకొని చేసినా క్యారెక్టర్ పేరు టార్జాన్. ఇక మీకు అసలు విషయం అర్థమై ఉంటుంది. టార్జాన్ పాత్రలో నటించడంతోనే వారికి ఎక్కువ శాతం మాట్లాడే అవకాశం దక్కలేదు మొదటిగా టార్జన్ పాత్ర పోషించింది కృష్ణ. 1967లో ఇద్దరు మోసగాళ్లు సినిమాలో కృష్ణ మొదటిసారి టార్జాన్ గా నటించారు. విఠలాచార్య దర్శకత్వం వహించారు.
Also read:
Advertisement
- ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
- HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?
- బాలకృష్ణ, హరికృష్ణలు కలిసి నటించిన 3 సినిమాలు!
ఎన్టీరామారావు టార్జాన్ పాత్రలో 1987లో వచ్చిన రాజపుత్ర రహస్యం సినిమాలో నటించారు. మొదటి పార్ట్ అంతా కూడా పూర్తిగా మాటల్లేకుండానే ఎన్టీఆర్ నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే అడవి దొంగ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి టార్జాన్ గా నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇది. చిరంజీవి పక్కన హీరోయిన్ గా రాధ నటించారు. చిరు చేసిన ఏకైక టార్జాన్ మూవీ అదే. ఎన్టీ రామారావు కృష్ణ నటించిన ఈ సినిమాలు జానపద నేపథ్యంలో వచ్చాయి. చిరంజీవి నటించిన సినిమా అయితే సాంఘిక నేపథ్యంతో తెర మీదకు ఎక్కింది ఏది ఏమైనా సగం సినిమా వరకు ఈ ముగ్గురు హీరోలు డైలాగ్ లు చెప్పకుండా సినిమాలో నటించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!