Home » హీరో వెంకటేష్ చిన్నతనంలోనే తన ఫేవరెట్ హీరో కోసం అలాంటి పని చేశారా..!!

హీరో వెంకటేష్ చిన్నతనంలోనే తన ఫేవరెట్ హీరో కోసం అలాంటి పని చేశారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్. అంతేకాకుండా ఈ ఫ్యామిలీ నుంచి రానా కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ వెంకటేష్ నటన చాలా స్పెషల్ గా ఉంటుంది. అంతేకాదు ఎలాంటి వివాదాలు లేని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. అలాంటి వెంకటేష్ 18 సంవత్సరాల వయసులోనే తన ఫేవరెట్ హీరో కోసం అలాంటి పని చేశారట.. అదేంటో చూద్దామా..

Advertisement

ఇండస్ట్రీలో విలక్షణ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హిట్ లు ప్లాఫులు అనే సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. అయితే వెంకటేష్ కు చిన్నతనం నుంచే శోభన్ బాబు అంటే చాలా ఇష్టమట. అయితే చిన్న వయసులోనే శోభన్ బాబుతో ఒక మూవీ నిర్మాణం కూడా అది కూడా తన పేరుతోనే చేశాడట. అయితే వాస్తవానికి వెంకటేష్ కి హీరో అవ్వాలని కోరిక లేదట. ఆయనకు శోభన్ బాబుని చూసిన తర్వాతే హీరో అవ్వాలని కోరిక కలిగిందట.

Advertisement

అప్పటికి తన సోదరుడు పేరిట తండ్రి రామానాయుడు స్థాపించిన సురేష్ మూవీస్ మంచి ఫామ్ లో ఉంది. ఇక 18 ఏళ్ల వయసులో వెంకీ సినిమా చేయాలని భావించి సురేష్ బ్యానర్ పై మాత్రమే చేయాలని రామానాయుడు చెప్పారట. కానీ వెంకటేష్ మాత్రం ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక ప్రత్యేక బ్యానర్ పెట్టి శోభన్ బాబును కలిసి ప్రపోజల్ చేశారట. దీంతో శోభన్ బాబు కూడా ఓకే అనడంతో 1978 వెంకీ నాయుడు బావ మూవీని శోభన్ బాబు మరియు వాణిశ్రీ జంటగా వెంకటేష్ సినిమా తీశారు.

మరి కొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading