Home » ట‌బు ఇప్ప‌టికీ నాన్న‌ను క‌లుస్తుంది…నాగ‌చైత‌న్య ఓపెన్ కామెంట్స్..!

ట‌బు ఇప్ప‌టికీ నాన్న‌ను క‌లుస్తుంది…నాగ‌చైత‌న్య ఓపెన్ కామెంట్స్..!

by AJAY

టాలీవుడ్ లో నాగార్జున అంటే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఆయ‌న అంటే హీరోయిన్ లు సైతం ప‌డిచచ్చిపోతుంటారు. అర‌వై ఏళ్లు దాటినా ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపిస్తుంటారు నాగ్. ఇక ఇప్పుడే నాగార్జున‌కు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంటే ఆయ‌న యంగ్ హీరోగా ఉన్న‌ప్పుడు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ లే నాగార్జున వెంట ప‌డేవారు.

ముఖ్యంగా నాగార్జున నిన్నేపెళ్లాడ‌తా సినిమా త‌ర‌వాత ఆ సినిమా హీరోయిన్ టబుతో ప్రేమాయ‌ణం న‌డిపించారు అంటూ వార్త‌లు వినిపించాయి. అంతేకాదు ట‌బు ఇప్ప‌టి వ‌ర‌కూ పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం కూడా నాగార్జ‌న నే అనే టాక్ కూడా ఉంది. ఇక ఈ ప్ర‌శ్న‌తాజాగా నాగార్జున పెద్ద‌కుమారుడు నాగ‌చైత‌న్య‌కు సైతం ఎదుర‌య్యింది.

Nagachaitanya

Nagachaitanya

దాంతో చైతౌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఇండ‌స్ట్రీ నుండి మా ఫ్యామిలీకి ఎంతో ద‌గ్గ‌రైన వ్య‌క్తి టబు ని అన్నాడు. నేను చిన్న‌త‌నంలో ఉన్న‌నాటి నుండి ట‌బు మా ఫ్యామ‌లీకి చాలా క్లోజ్ అని చైతూ చెప్పాడు. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన‌వారిలా కాకుండా సొంత వ్య‌క్తిలా ఉండేవార‌ని అన్నాడు. టబు కుటుంబంలో ఒక‌రితో త‌మ‌తో క‌లిసిపోయింద‌ని చైతూ చెప్పాడు.

ఇప్ప‌టికి కూడా టబు త‌మ ఫ్యామిలీలో జ‌రిగే ఫంక్ష‌న్ ల‌కు పండ‌గ‌ల‌కు హాజ‌ర‌వుతార‌ని చెప్పాడు. అంతే కాకుండా హైద‌రాబాద్ కు వ‌చ్చిన ప్ర‌తిసారి మా నాన్న‌ను మ‌మ్మ‌ల్ని క‌లుస్తుంద‌ని అన్నారు. ఇదిలా ఉంటే గతంలో నాగార్జున కూడా ఇలాంటి కామెంట్స్ యే చేశాడు. టబు కేవ‌లం త‌న‌కు స్నేహితురాలు మాత్ర‌మే అన్నాడు. హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తిసారి త‌మ‌ను క‌లుస్తుంద‌ని చెప్పాడు. చైతూ నాగ్ చెప్పిన మాట‌లు వింటుంటే టబు నాగ్ మంచి ఫ్రెండ్స్ మాత్ర‌మే అనిపిస్తుంది. కానీ నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో ఇద్ద‌రి కెమిస్ట్రీ వ‌ల్లే అలాంటి వార్త‌లు వ‌చ్చాయేమో.

ALSO READ : శర్వానంద్ కు ఇన్ని కోట్ల కట్న కానుకలు ఇచ్చారా..?

Visitors Are Also Reading