Home » Hero Venkat : హీరో వెంకట్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Hero Venkat : హీరో వెంకట్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

by Bunty
Ad

ఆనందం మూవీ హీరో వెంకట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మంచి లవ్ స్టోరీ ఉండడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వెంకట్… జగపతి, బాలకృష్ణ, చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు.

Advertisement

కానీ కొన్ని రోజులకి ఈ వ్యక్తిని చాలామంది మర్చిపోయారు. ఇతను తాజాగా పలు షోలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ… తాను సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. అతనికి విషయంలో తనకు సరైన అవగాహన లేకపోవడం వల్లే సినిమాల్లో రాణించలేకపోయానన్నారు. తను హీరోగా చేసిన చాలా సినిమాలు డిజాస్టర్ గా మారడంతో నేను హీరోగా రాణించలేకపోయాను అని చెప్పుకొచ్చారు.

Advertisement

తనకు సినిమాలు పెద్దగా కలిసి రాలేకపోయినప్పటికీ… వ్యక్తిగతంగా పలు బిజినెస్లు, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వంటి వ్యాపారాలు బాగా కలిసి వచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రముఖ సోలార్ కంపెనీతో తనకు డీలింగ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఏమైనా సినిమా కథలు నచ్చితే సినిమాల లో నటిస్తానని వెల్లడించారు. ఇక అతను సినిమాలకు మళ్ళీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

పర్సులో వీటిని పెట్టుకుంటే… ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుంది…!

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

 

Visitors Are Also Reading