Home » శ్రీలీల గురించి సీక్రెట్స్ వింటే షాక్ అవ్వడం గ్యారెంటీ.. నితిన్ ఏమన్నారంటే ?

శ్రీలీల గురించి సీక్రెట్స్ వింటే షాక్ అవ్వడం గ్యారెంటీ.. నితిన్ ఏమన్నారంటే ?

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ శ్రీ లీల పేరు కూడా ఒకటి. ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ.. చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ కోర్సులు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర చేయడం విశేషం.

Advertisement

సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. శ్రీలీల లో ఉన్న మరిన్ని టాలెంట్ల గురించి బయట పెట్టేశాడు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నేను హీరో, డాన్స్ వచ్చు నాకు అని మామూలుగానే ఉంటుంది. శ్రీ లీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది. డాన్స్ చేస్తుందని తెలుసు. డాక్టర్ చదువుతుందని తెలుసు.షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది. తన గురించి అడిగితే చెప్పింది.


తాను యాక్టింగ్, డాన్స్, డాక్టర్ మాత్రమే కాదు. స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది. హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది.తనకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ కూడా వాయిస్తుంది. ఇంకా చాలా చెప్పింది. నేను ఆరోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన టాలెంట్ బయటపడేవి. ఇంత చిన్న పిల్లల్లో ఎన్ని టాలెంట్స్ అని ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో నేను ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. కానీ అసలు శ్రీలీల ఎక్స్ ట్రా ఆర్డినరీ ఉమెన్ అని అంటూ అందరి ముందు శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపించాడు హీరో నితిన్. నితిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రీ లీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రియల్లీ శ్రీ లీల చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో అన్ని టాలెంట్స్  అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading