హ్యాపిడేస్ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన చాలా మంది హీరోలుగా రానిస్తున్నారు. విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. అదేవిధంగా మరికొందరు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. అందులో నిఖిల్ కూడా ఒకరు. నిఖిల్ చేసిన స్వామిరారా, కార్తీకేయ, కార్తికేయ 2 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. దాంతో నిఖిల్ క్రేజ్ పెరిగిపోయింది.
Advertisement
ఇక నిఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇప్పటికే పెళ్లైన సంగతి తెలిసిందే. కాగా తన భార్యతో కలిసి నిఖిల్ వెన్నెల కిషోర్ టాక్ షో అలా మొదలైంది లో పాల్గొన్నాడు. ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా కొత్త దంపతులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిఖిల్ భార్య పల్లవిని వెన్నెల కిషోర్ లవ్ స్టోరీ గురించి ప్రశ్నించారు. దానికి పల్లవి సమాధానం ఇస్తూ…నిఖిల్ తనను సేడ్ స్టోరీ చెప్పి పడేశారని అన్నారు. దాంతో తన జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయా అని అనుకున్నానని చెప్పారు.
Advertisement
ఆ తరవాత నిఖిల్ ఫోన్ లో మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందా అని కిషోర్ ప్రశ్నించాడు. దానికి ఉంటుందని లేకపోతే ఎంతమంది పల్లవిలకు మెసేజ్ చేసేవారో అంటూ సరదాగా అన్నారు. అంతే కాకుండా హలో గురూ ప్రేమకోసమే రా ఈ జీవితం అంట నిఖిల్ భార్యతో కలిసి స్టెప్పులు వేశారు. కాగా వెన్నల కిషోర్ టాక్ షో ప్రోమో ఆకట్టుకునేవిధంగానే ఉంది మరి పూర్తి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Advertisement
also read :మంచు మనోజ్ కి అనుచరుడిగా ఉన్న సారథి ఎవరో తెలుసా ?