మంచు మోహన్ బాబు వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అన్నదమ్ముల మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
అయినప్పటికీ ఈ విషయం బయటపడకుండా మంచు ఫ్యామిలీ చాలా జాగ్రత్త పడింది. తాజాగా మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తీరుతో సహనం కోల్పోయిన మనోజ్ అసలు విషయాన్ని వెల్లడించాడు.
Also Read : ‘రంగమార్తాండ’ సినిమాను పట్టించుకోని టాలీవుడ్ స్టార్లు?
Advertisement
ముఖ్యంగా మనోజ్ అనుచరుడైనటువంటి సారథిపై దాడి చేసిన వీడియోను షేర్ చేశాడు. అన్నదమ్ముల వివాదంలో సారథి అనే వ్యక్తి చాలా కీలకంగా మారాడు. అసలు ఈ సారథి ఎవరు అని చాలా ఆసక్తిగా మారింది. విష్ణు-మనోజ్ వివాదంలో మొదటి నుంచి ఇతడే ముఖ్య పాత్రదారి అని తెలుస్తోంది. అతని వల్లనే అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ నుంచి విష్ణు అనుచరుడిగా ఉన్న సారథి ప్రస్తుతం మనోజ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సారథి మోహన్ బాబు బంధువు అట. అయితే కొంత కాలంగా మంచు ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటూ అన్ని వ్యవహారాల్లో సారథి చాలా చురుకుగా ఉంటున్నట్టు సమాచారం. మా ఎన్నికల సమయంలో కూడా సారథి మంచు విష్ణుతో పాటే ఉన్నాడు.
Also Read : Pavithra Naresh Marriage : నాలుగో పెళ్లిపై అసలు విషయం చెప్పేసిన నరేష్… ‘మళ్లీ పెళ్లి’ అంటూ పోస్టర్ రిలీజ్!
ఆ తరువాత పలు కారణాల వల్ల విష్ణుకు దూరమైన సారథి మంచు మనోజ్ కి దగ్గరయ్యాడు. ఈ తరుణంలోనే అన్నదమ్ముల మధ్య సారథి మనస్పార్థాలు సృష్టించాడని విష్ణు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. తన గురించి అనుచితంగా మాట్లాడాడనే సారథిపై విష్ణు దాడి చేసినట్టు సమాచారం. ఇక ఈదాడిలో సారథి స్వల్పంగా గాయపడడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తాజాగా ఈ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మోహన్ బాబు కల్పించుకొని కొడుకులపై చాలా సీరియస్ అయ్యాడు. మోహన్ బాబు చెప్పడంతోనే మనోజ్ వీడియోని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.
Advertisement
Also Read : వైరల్ అవుతున్న తారకరత్న చివరివీడియో…చూస్తే కన్నీళ్లు ఆగవు..!