Home » 19 ఏళ్ళకే ఆ నటుడి తమ్ముడితో ప్రేమ పెళ్లి…నటి హేమ లవ్ స్టొరీ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…!

19 ఏళ్ళకే ఆ నటుడి తమ్ముడితో ప్రేమ పెళ్లి…నటి హేమ లవ్ స్టొరీ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…!

by AJAY
Ad

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ కూడా ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలో నటిస్తూ హేమ అభిమానులను సంపాదించుకుంది. కామెడీ పాత్రల్లో సైతం నటిస్తూ హేమ ప్రేక్షకులను నవ్విస్త్తోంది. బాలయ్య హీరోగా నటించిన భలేదొంగ సినిమా తో హేమ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తో పాటు తమిళ,హిందీ భాషల్లో దాదాపు 500 సినిమాల్లో నటించి అలరించింది.

Advertisement

కోయే సరళ తరావత బ్రహ్మానందం కు భార్య గా నటించి ఎక్కువ సినిమాలు చేసింది. మరోవైపు మా ఎలక్షన్స్ లో రాజకీయాలు చేసి హేమ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా హేమ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఓ ఇంటర్వ్యూ లో హేమ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. తనది ప్రేమ పెళ్లి అని తెలిపింది.

Advertisement

తాను దూరదర్శన్ లో పని చేస్తున్న సమయంలో నటుడు మీర్ తమ్ముడు అయిన జాన్ తో ప్రేమలో పడ్డామని పేర్కొంది. ఓ సారి తాను ఎగ్జిబిషన్ కు వెళుతుండగా జాన్ కూడా వచ్చాడని తెలిపింది. మొదటి సారి కలిసినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడని తెలిపింది.

లవ్ అంటూ మాటలు చెప్పకుండా నేరుగా అలా అడగటం తనకి నచ్చింది అని అందుకే అతడిని పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. జాన్ ముస్లిం అని తాను హిందూ అని పేర్కొంది. ఇక ఇప్పుడు హేమ జాన్ లకు ఒక కుమార్తె ఉంది.

Visitors Are Also Reading