ట్రైండ్ కి తగ్గట్టుగా సినిమాలు చేయడం…హీరోలను గత సినిమాలకంటే అందంగా చూపించడం తెలిసిన దర్శకుడు పూరీజగన్నాత్. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న చాలా మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ లను ఇచ్చిన దర్శకుడు కూడా పూరిజగన్నాత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
Advertisement
పూరీ పవన్ కల్యాణ్ కు బద్రీ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు. అదే విధంగా బన్నీకి దేశముదురుతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. మహేశ్ బాబుకు పోకిరితో మంచి హిట్ ఇచ్చాడు. మాస్ మహరాజ్ రవితేజ కు ఇడియట్ ఇచ్చాడు.
Advertisement
Puri Jaganaadh Family
puri jagannath marriage
ఇలా చెప్పుకుంటూ పూరీ నిలబెట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక పూరీ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నాడు కానీ ఒకప్పుడు ఆయన కూడా ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో పూరీ ఎన్నో కష్టాలు ఎదుర్కున్నట్టు తెలిపాడు. ముఖ్యంగా తన పెళ్లి సమయంలో ఎక్కువ కష్టాలు పడినట్టు తెలిపాడు. తాను ప్రేమ వివాహం చేసుకున్నానని ఆ సమయంలో తన చేతిలో ఒక్కరూపాయి కూడా లేదని చెప్పాడు. అప్పుడే సినిమా అవకాశాల కోసం వచ్చానని ప్రేమ వివాహం కావడంతో ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేయలేదని తెలిపాడు.
also read : యాంకర్ గా పరిచయమై హీరోయిన్లుగా మెప్పించిన ముద్దుగుమ్మలు వీరే…!
Puri Jaganaadh wife, Marriage photos
తాళిబొట్టు కొనేందుకు కూడా తన వద్ద డబ్బులేదని యాంకర్ జాన్సీ తనకు తాలి బొట్టు కొనిచ్చిందని చెప్పాడు. అదే విధంగా నటి హేమ తమకు బట్టలు కొనిచ్చిందని పూరీ తెలిపాడు. ఇక తన పెళ్లి ఒక గుడిలో జరిగిందని తన స్నేహితులు స్నేహితులు పెళ్లిలో కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నానని డబ్బు సంపాదించి కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోయానని చెప్పారు. కానీ తన జీవితంలో హేమ, జాన్సి మరియు తన స్నేహితులను మర్చిపోనని చెప్పారు.
Advertisement