Home » యాంకర్ గా పరిచయమై హీరోయిన్లుగా మెప్పించిన ముద్దుగుమ్మలు వీరే…!

యాంకర్ గా పరిచయమై హీరోయిన్లుగా మెప్పించిన ముద్దుగుమ్మలు వీరే…!

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంతమంది యాంకర్లు గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. అలా కొందరు పూర్తిగా సినిమాలకే పరిమితం కాగా మరికొంతమంది టీవీ షోలు సినిమాలు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక అలా మొదట యాంకరింగ్ చేసి ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకున్న బ్యూటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

1) నిహారిక కొణిదెల

మెగా డాటర్ నిహారిక కొణిదెల మొదట ఢీ డాన్స్ షో కి యాంకర్ గా చేసింది. తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత “ఒక మనసు” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలోనూ నిహారిక రాణిస్తోంది.

2)కలర్స్ స్వాతి

కలర్స్ అనేది స్వాతి ఇంటిపేరు కాదు. ఆమె మొదట యాంకర్ గా చేసిన టెలివిజన్ షో పేరు. కలర్స్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న స్వాతి 2008లో “అష్టాచమ్మా” సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. 2008లో ఏకంగా నంది అవార్డును సొంతం చేసుకుంది.

jabardasth anasuya

jabardasth anasuya

3) అనసూయ భరద్వాజ్

జబర్దస్త్ బ్యూటీ అనసూయ మొదటగా టీవీ9 ఛానల్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా మొదటి గా ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో కూడా నటించింది. ఆ తరవాత జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ షో ద్వారా ఎంతో పాపులారిటీ రావడంతో అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. ఓ వైపు టీవీ షోలు చేస్తున్న అనసూయ సినిమాలు సైతం చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Advertisement

3) రష్మి గౌతమ్

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మరో నటి రష్మి గౌతమ్. మొదటగా రష్మీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి యాంకర్ గా పరిచయం అయింది. ఇక 2007లోనే రష్మి ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ గుంటూర్ టాకీస్ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

4) శ్రీముఖి

శ్రీముఖి కూడా మొదటగా యాంకర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇక 2015 లో శ్రీముఖి చంద్రిక సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. అంతే కాకుండా బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి కూడా ఆకట్టుకుంది.

5) సుమ కనకాల

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మొదటగా 1998లో సుమ ఒరు విలియమ్ కాతోర్తు అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ గా రాణిస్తోంది. అంతేకాకుండా తాజాగా సుమ కీలక పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

also read: RRR FIRST REVIEW : ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది…సినిమాలో హైలెట్ అదేన‌ట‌..!

 

Visitors Are Also Reading