Telugu News » Blog » ఏఆర్ రెహ‌మాన్ పెద్ద కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియో మీరు చూశారా..?

ఏఆర్ రెహ‌మాన్ పెద్ద కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియో మీరు చూశారా..?

by Anji
Ads

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ పుర‌స్కార గ్ర‌హీత ఏ.ఆర్‌.రెహ‌మాన్ పెద్ద కూతురు ఖ‌తీజా రెహ‌మాన్ పెళ్లి ఇటీవ‌ల ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను రెహ‌మాన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రియాస్దీన్ షేక్ మ‌హ‌మ్మ‌ద్ అనే సౌండ్ ఇంజ‌నీర్‌తో మే 05న ఆమె పెళ్లి జ‌రిగింది. ఆ వివాహానికి సంబంధించిన ఫోటోల‌ను కూడా రెహ‌మాన్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం అవి వైర‌ల్ అయ్యాయి.

Ads

ఖ‌తీజా పెళ్లి వేడుక‌ను సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు స‌మీప బంధువులు హాజ‌ర‌య్యారు. రెహ‌మాన్ విడుద‌ల చేసిన ఈ వీడియోలో వారంద‌రినీ చూడ‌వ‌చ్చు. మ‌రొక‌వైపు రెహ‌మాన్ కూతురి కోసం ఇటీవ‌ల మ్యూజిక‌ల్ వెడ్డింగ్ రెసెప్ష‌న్ నిర్వ‌హించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో పలువురు అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుక‌కు కొంత‌మంది సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రైన‌ట్టు స‌మాచారం.

 

ప్ర‌ధానంగా ప్ర‌ముఖ న‌టి మ‌నిషా కోయిరాలా ఉన్నారు. ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లి వేడుక వీడియోను సినిమా తీసిన‌ట్టే అన్ని ప్లాన్ చేసుకుని తీశారు. ఖ‌తీజా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసి వివ‌రాల‌ను రాసుకొచ్చారు. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? స‌ంగీతం ఎవ‌రు..? ఎగ్జిక్యూష‌న్‌, కో ఆర్డినేష‌న్‌, గ్రాఫిక్ డిజైన‌ర్, వెడ్డింగ్ కేక్ అంటూ వివ‌రాల‌ను రాసుకొచ్చారు. అదేవిధంగా పెళ్లి వేడుక‌లో ఏయే రోజు కార్య‌క్ర‌మానికి ఎవ‌రు ప‌ని చేశార‌నే విష‌యాలు కూడా ఖ‌తీజా ఇన్‌స్టాలో చూడ‌వ‌చ్చు. ఇక రెహ‌మాన్ ఖ‌తీజా సింగ‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2010లో వ‌చ్చిన రోబో చిత్రంలో ఓ మ‌ర‌మ‌నిషి అనే పాట‌ను ఆమెనే పాడింది. ఇటీవ‌ల ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన కృతిస‌న‌న్ సినిమా మిమిలో కూడా రాక్ ఏ బై బేబీ అనే పాట‌ను కూడా ఆమె ఆల‌పించింది.

Also Read : 

వేదం, మిరపకాయ్ సినిమాలో నటించిన దీక్ష సేథ్ ఇప్పుడెలా ఉంది ? ఏమి చేస్తుదంటే ?

Ad

ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ ఇచ్చిన పేప‌ర్ ప్ర‌క‌ట‌న గురించి తెలుసా..?