Home » ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ ఇచ్చిన పేప‌ర్ ప్ర‌క‌ట‌న గురించి తెలుసా..?

ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ ఇచ్చిన పేప‌ర్ ప్ర‌క‌ట‌న గురించి తెలుసా..?

by Anji
Ad

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌నొక స‌మ‌యంలో ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు చాలా మంది స్టార్ హీరోలు పోటాపోటీగా న‌టించారు. సినిమాలు కూడా అదేవిధంగా విడుద‌ల చేసారు. ఎన్టీఆర్, కృష్ణ‌, ఏఎన్ఆర్ మ‌ధ్య పోటీ ఉండేది. కొన్ని సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే మ‌రికొన్ని సంద‌ర్భాల్లో కృష్ణ మ‌రిన్ని సంద‌ర్భాల్లో ఏఎన్నార్ పై చేయి సాధించేవారు. ఒక‌నొక స‌మ‌యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి అడుగు పెట్టి త‌క్కువ స‌మ‌యంలోనే సీఎం అయి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ స‌మ‌యంలో కృష్ణ హీరోగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ ఈనాడు విడుద‌ల అయింది. ఈ చిత్రం మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ సాధించిన ఈనాడ్ సినిమాకు ఇది రీమెక్‌గా తెర‌కెక్కింది.


తొలుత కృష్ణ ముత్యాల ముగ్గు శ్రీ‌ధ‌ర్ హీరోగా ఈ సినిమాను చేయాల‌ని భావించారు. అదేవిధంగా పి.సాంబ‌శివ‌రావును ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసి పరుచూరి బ్ర‌ద‌ర్స్‌కు అప్ప‌గించారు. కానీ ఈ సినిమాలో కృష్ణ హీరోగా న‌టిస్తే బాగుంటుంద‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ద‌ర్శ‌కునికి చెప్పార‌ట‌. అదేవిధంగా కృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు స‌రిపోయేవిదంగా మార్పులు చేసి మాట‌లు రాసుకున్నార‌ట పరుచూరి బ్ర‌ద‌ర్స్‌. అలా కృష్ణ 200వ సినిమాగా ఈనాడు సినిమా తెర‌మీదికి వ‌చ్చింది.

Advertisement

Advertisement


స‌మాజం కోసం త‌న జీవితాన్ని త్యాగం చేసిన వ్య‌క్తి పాత్ర‌లో కృష్ణ ఈ చిత్రంలో అద్భుతంగా న‌టించారు. 1982 డిసెంబ‌ర్ 17న విడుద‌లై సూప‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా పాట‌ను చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్‌కు మ‌ద్ద‌తుగా కృష్ణ ఈ పాట‌లో న‌టించార‌ని అప్ప‌ట్లో భావించారు. సరిగ్గా ఈనాడు సినిమా విడుద‌లైన రెండు వారాల త‌రువాత టీడీపీ విజ‌యం సాధించింది. అదేస‌మ‌యంలో ఎన్టీఆర్ అధికారంలోకి వ‌చ్చారు. ఎన్టీఆర్‌ను అభినందిస్తూ.. కృష్ణ ఓ పేప‌ర్‌లో ఓ యాడ్ కూడా చేశారు. అది అప్ప‌ట్లోనే సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి.

Also Read : 

బాలయ్య సినిమాకు అభిమానులా టైటిల్…!

రాధికా ఆప్టేను అక్కడ సర్జరీలు చేసుకోమన్నారాట..!

 

Visitors Are Also Reading