Telugu News » Blog » వేదం, మిరపకాయ్ సినిమాలో నటించిన దీక్ష సేథ్ ఇప్పుడెలా ఉంది ? ఏమి చేస్తుదంటే ?

వేదం, మిరపకాయ్ సినిమాలో నటించిన దీక్ష సేథ్ ఇప్పుడెలా ఉంది ? ఏమి చేస్తుదంటే ?

by Anji
Published: Last Updated on
Ads

సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు కొంత మంది హీరోయిన్లు ఏళ్ల కొద్ది అలాగే పాతుకుపోయి స్టార్‌హీరోయిన్లుగా కొన‌సాగుతుంటారు. మ‌రికొంత మంది ఒక‌టి రెండు సినిమాల్లో క‌నిపించి మ‌ర‌ల అదృశ్య‌మ‌వుతుంటారు. ఇలా చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా వ‌చ్చిన అవ‌కాశాల‌ను వారు స‌ద్వినియోగం చేసుకోలేక కెరీర్‌లో ముందుకు వెళ్ల‌లేరు.

Advertisement

అందం, అభిన‌యం రెండు ఉన్న‌ప్ప‌టికీ కొంత‌మందికి అదృష్టం మాత్రం అచ్చిరాదు. అలాంటి హీరోయిన్‌ల‌లో దీక్ష‌సేథ్ ఒక‌రు అని చెప్పాలి. 2009లో మిస్ ఫెమినా అందాల పోటీల‌లో ఫైన‌ల్ లిస్ట్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండ‌స్ట్రీలోకి రంగ ప్ర‌వేశం చేసింది.

Advertisement

క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వేదం సినిమాలో అల్లుఅర్జున్‌కు జోడిగా న‌టించింది దీక్ష‌సేథ్‌. ఆ సినిమా త‌రువాత ర‌వితేజ మిర‌ప‌కాయ్ సినిమాలో కూడా న‌టించింది. అదేవిధంగా రెబల్ స్టార్ ప్ర‌భాస్ రెబెల్ సినిమాలో కూడా న‌టించింది. ఇక ఆ త‌రువాత గోపిచంద్ హీరోగా న‌టించిన ఒంట‌రి, ఇక మంచు మ‌నోజ్ స‌ర‌స‌న ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా వంటి సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డికి అంత‌గా క్రేజ్ మాత్రం రాలేదు. పెద్ద హీరోల‌తో చేసినా ఆమె అంత‌గా గుర్తింపు తెచ్చుకోలేదు. ఈమె న‌టించిన సినిమాల్లో వేదం సినిమా ఒక్క‌టే గుర్తింపు పొందిన పాత్ర చేయ‌డం విశేషం.


అందం, అభిన‌యం అన్ని ఉన్న‌ప్ప‌టికీ టాప్ హీరోల‌తో మంచి హిట్లు ప‌డినా ఈ హీరోయిన్ కాలం క‌లిసి రాలేద‌నుకుంటా అందుకే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. తెలుగు వ‌దిలేసి బాలీవుడ్ వైపే చూసింది. 2014లో లేక‌ర్ హ‌మ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత వ‌చ్చిన జ‌గ్గు దాదా సినిమాతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇదే ఏడాది హిందీలో మ‌రొక సినిమాలో కూడా న‌టించింది. కానీ ఆ సినిమాలు ఈమె కెరీర్ కు అంత‌గా ఉప‌యోగ‌ప‌డలేదు. ఈ సినిమాల త‌రువాత దీక్ష‌సేథ్ ఏ సినిమాలో కూడా న‌టించ‌లేదు. ప్ర‌స్తుతం ఈమె ఏమి చేస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈమె గురించి చ‌ర్చ మొద‌లైంది. ఈమె ఎక్క‌డ ఉందో అని ఆరా తీయ‌డం ప్రారంభించారు. సినిమాలు వ‌దిలేసినా కానీ అభిమానుల‌కు అందుబాటులో ఉండి ఉంటే దీక్ష‌సేథ్‌కు కాస్త గుర్తింపు ఉండేదేమో.

Also Read : 

ప‌ద‌వ‌త‌ర‌గ‌తిలో బార్డ‌ర్ మార్కుల‌తో పాస్.. ప్ర‌స్తుతం క‌లెక్ట‌ర్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

Advertisement

ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలకు దీటుగా నిలిచి చిరుకి వంద రోజులు ఆడిన తొలి సినిమా ..!