Home » మెగాస్టార్ డాడీ సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

మెగాస్టార్ డాడీ సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

by Anji

 మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఫేమ‌స్ చిత్రాల‌లో డాడీ సినిమా ఒక‌టి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ డాడీ.. తండ్రి కూతుళ్ళ మధ్య సాగే ఎమోషనల్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సిమ్రాన్ నటించిన విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఎంఎస్ నారాయణ, అల్లు అర్జున్, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ , నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రలో నటించిన అక్షయ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా ద్వారా చిన్నారి ఎంతో గుర్తింపు పొందింది. అయితే ఈ చిత్రంలో నటించిన చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకి చెందినటువంటి అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది తెలిసిన వారి ద్వారా అవకాశాలు దక్కించుకుంది. ఈ చిత్రంలో అనుష్క మల్హోత్ర పాత్ర హైలెట్ అయిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆమెకు అనేక చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లలో ఆఫర్స్ వచ్చాయట. కానీ ఆమె పై చదువులకు ఇబ్బంది ఏర్పడుతుందని సినిమాలకు దూరంగా ఉంచి ఆమె పై చదువులు చదివించారట తల్లిదండ్రులు.

అలాంటి చిన్నారి అనుష్క ప్రస్తుతం పెద్దదైపోయింది. డిగ్రీ పూర్తి చేసుకొని మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. తాజాగా ఆమె కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు డైరెక్షన్ లో ఒక సినిమా కూడా చేస్తోందని తెలుస్తోంది. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే దర్శనమిస్తున్నాయి.  ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డాడీ సినిమాలో నటించిన చిన్నారి ఇంత అందంగా తయారయిందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading