Home » బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ పోస్టర్ చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ పోస్టర్ చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నందమూరి నటవారసుడిగా తండ్రి పోలికలతో పాటు, లక్షణాలను పుచ్చుకొని నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. నటసింహంగా నందమూరి అభిమానుల మన్ననలు పొందుతూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వీరసింహారెడ్డితో మరో హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. 

Advertisement

ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ సెల్ లోనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. తాజాగా నందమూరి బాలయ్య బాబు హీరోగా మొదటి ఇంటర్వ్యూ పత్రిక పేపర్ సోషల్ మీడియాలో అయ్యాక ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ పత్రిక పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆ ఇంటర్వ్యూలో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకోవాలని ఉందని పేర్కొన్నాడు బాలయ్య. అంతేకాదు.. తన తండ్రి పోలికలు వచ్చినంత మాత్రాన అందరూ తన తండ్రి మాదిరిగానే చూడాల్సిన పని లేదని.. తనలోని ప్రత్యేక నటుడు ఉన్నాడని.. సమయం వచ్చినప్పుడు బయటపడుతుందని పేర్కొన్నాడు.అయితే ఆ పేపర్ ఏ వార్తా పత్రికకు సంబంధించిందో మాత్రం తెలియదు. ఇప్పుడు మాత్రం బాలయ్య ఇంటర్వ్యూ ఇచ్చిన పేపర్ తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

ప్రస్తుతం అమెరికాకు చెందిన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన బాలయ్య రాగానే భగవంత్ కేసరి సెట్స్ లో అడుగుపెడతాడు. ఓవైపు సినిమాలతో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి, అఖండ మూవీస్ సూపర్ హిట్ కావడంతో భగవంత్ కేసరి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో సినిమా మినిమం గ్యారెంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ప్రతీ సినిమా కూడా సక్సెస్ సాధించింది. మరీ భగవత్ కేసరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేష్ మూవీ కోసం ప్రత్యేక సెట్.. యాక్షన్ సీన్స్ కోసమేనా..?

కేవలం ఆ సీన్స్ కోసం తమన్నా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

Visitors Are Also Reading