Home » మహేష్ మూవీ కోసం ప్రత్యేక సెట్.. యాక్షన్ సీన్స్ కోసమేనా..?

మహేష్ మూవీ కోసం ప్రత్యేక సెట్.. యాక్షన్ సీన్స్ కోసమేనా..?

by Anji

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను సెలెక్ట్ చేశారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి పూజ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల ను మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. అదేవిధంగా మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ జట్టు స్పీడుతో జరుగుతోంది. గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఈ సినిమాను  మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇప్పటివరకు క్లాస్ సినిమాలు చేస్తూ వస్తున్నా మహేష్.. ఈ మూవీతో మరోసారి తన మాస్ ను చూపించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం ఇప్పటికే ఓ ప్రత్యేక సెట్టును ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ కోసం ఈ సెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హీరో మహేష్ బాబు తో పాటు ఇతర తారాగాణం కూడా ఈ సీన్ లో పాల్గొంటున్నారట. టైటిల్ కు తగినట్టుగానే గుంటూరు బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్.

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట రాజమౌళి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. త్వరలోనే స్క్రిప్ట్ ని దర్శకుడికి అందించనున్నట్టు ఇటీవలే ప్రకటించారు రచయిత విజయేంద్రప్రసాద్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమా గురించి ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాల పైకి వెళ్తుందో.. ఎప్పుడు విడుదల అవుతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రాజమౌళి ఈ సినిమాను ఎప్పుడు షూటింగ్ ప్రారంభిస్తాడు వేచి చూడాలి మరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. అతను ఎవరో తెలుసా ?

 మరోసారి వివాదంలో చిక్కుకున్న నయనతార దంపతులు..! ఉమ్మడి ఆస్తులు కాజేసారంటూ వారిపై కేసు నమోదు

”బేబీ” సినిమా మీద నెటిజన్ చేసిన నెగిటివ్ కామెంట్ కి.. ఆనంద్ దేవరకొండ రియాక్షన్..!

Visitors Are Also Reading