Home » బాలకృష్ణ వసుంధరల వివాహ పత్రికను మీరు చూశారా.. పెళ్లి ఎక్కడ జరిగిందంటే ?

బాలకృష్ణ వసుంధరల వివాహ పత్రికను మీరు చూశారా.. పెళ్లి ఎక్కడ జరిగిందంటే ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైనటువంటి నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్ కి బాలయ్య ఐదో సంతానం. సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలోనే వసుంధర దేవిని వివాహం చేసుకున్నారు బాలయ్య. వీరి పెళ్లి 1982 డిసెంబర్ 08వ తేదీ మధ్యాహ్నం 12గంటల 41 నిమిషాలకు జరిగింది. 

Advertisement

స్టార్ హీరో బాలకృష్ణ వసుంధరల పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ తెగ వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు ఈ వివాహ పత్రికను వైరల్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కర్ణాటక కళ్యాణ మండపంలో వీరి పెళ్లి జరిగింది. బాలకృష్ణ భార్య వసుంధరదేవి దేవులపల్లి సూర్యారావు, ప్రమీలా రాణి దంపతుల కూతురు.  డిసెంబర్ 8న వీరి పెళ్లి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అభిమాన హీరోకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  

Advertisement

Also Read :   హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో అదే హైలెట్ అట‌..! అస‌లు వ‌ర్కౌట్ అవుతుందా…?

Manam News

ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న విడుదల కానుంది. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు బాలయ్య. వసుంధర-బాలకృష్ణ దంపతులు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె బ్రాహ్మిణిని నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేయగా.. రెండో కుమార్తె తేజస్వినిని బిజినెస్ మెన్ కి ఇచ్చి వివాహం జరిపించారు. కుమారుడు మోక్షజ్ఞ  త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read :  లోకల్ ట్రైన్ లో ప్రయాణించి సింప్లిసిటీ చూపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా ?

Visitors Are Also Reading