Home » హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో అదే హైలెట్ అట‌..! అస‌లు వ‌ర్కౌట్ అవుతుందా…?

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో అదే హైలెట్ అట‌..! అస‌లు వ‌ర్కౌట్ అవుతుందా…?

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు సినిమాలను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న‌ సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్టు ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట‌ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాకుండా ఆ సీన్ దాదాపుగా 20 నుండి 22 నిమిషాల పాటు ఉండబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది.

PAWAN KALYAN

PAWAN KALYAN

ఆ సీన్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రేక్షకులు ఫిదా అవుతారట‌. అంతేకాకుండా ఆ సీన్ టాలీవుడ్ లోనే బెస్ట్ యాక్షన్ సీన్ గా నిలుస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాల్లో యాక్ష‌న్ సీన్లు కొత్త కాదు కానీ 20 నిమిషాల యాక్ష‌న్ సీన్ అనేస‌రికి ఆ సీన్ ఎలా ఉండ‌బోతుంది అని సినిమా పై అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి.

Visitors Are Also Reading