అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్‌బాబు, జగపతి ఆర్ట్ అధినేత ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వారసుడిగా జగపతిబాబు వీరు ముగ్గురు కూడా హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమెక్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీర ముగ్గురు కూడా అనుకోకుండా దర్శకుడు వి.మధుసూదనరావు చేతుల మీదుగా ఈ హీరోలు ఎంట్రిఇవ్వడం గమనార్హం. ఇకపోతే వీరు ముగ్గురు హీరోల్లో నాగార్జున, జగపతిబాబు హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ తనయుడు రమేష్ బాబు ఓ వెలుగు వెలిగినా ఆ తరువాత హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి.
Advertisement
ఇటీవలే హఠాన్మరణ చెంది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన వెలుగు నీడలు, సుడిగుండాలు సినిమాలో బాలనటుడిగా నటించిన నాగార్జున ఇక ఆ తరువాత హిందీలో జాకీష్రాఫ్, మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హీరో సినిమాకు రీమెక్‌గా 1986లో విక్రమ్ సినిమాతో హీరోగా నటించారు నాగార్జున. బాలనటుడిగా నటించిన అనుభవం కారణంగా రమేష్ బాబు 23 ఏళ్ల వయసులో సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
Advertisement
రమేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో ఎన్టీఆర్-కృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక హిందీలో సన్నిడియోల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా బేతాబ్ను తెలుగులో రీమెక్‌గా సామ్రాట్ పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజేంద్రసింగ్ బాబు తొలి షెడ్యూల్ పూర్తి చేయగా.. డబ్బులు లేక సినిమా ఆగిపోవడంతో సీనియర్ దర్శకుడు మధుసూదన్‌రావు దర్శకత్వం చేసి విజయం సాధించారు.అదేవిధంగా జగపతిబాబు కూడా ఖత్రోం కే ఖిలాడి సినిమాకు రీమెక్‌గా సింహ స్వప్నం సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసినా ఈ సినిమా మాత్రం హిట్ అవ్వకపోవడం గమనార్హం.
Also Read :
ఎన్టీఆర్: ఒకే ఏడాదిలో వరుసగా హిట్ అయినా మూవీస్.. ఇవేనా..?
వారెవ్వా శ్రీముఖా మజాకా.. ఒకేసారి అంత రేంజ్ పెరిగిందా..?