Home » వారెవ్వా శ్రీముఖా మజాకా.. ఒకేసారి అంత రేంజ్ పెరిగిందా..?

వారెవ్వా శ్రీముఖా మజాకా.. ఒకేసారి అంత రేంజ్ పెరిగిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మైక్ పట్టిందంటే స్టేజ్ అంతా దద్దరిల్లిపోతోంది. సమయానికి తగ్గట్టు మాటలు, మాటల తగ్గట్టు అందచందాలు ఆమెకే సొంతం.. ఇంతకీ ఎవరు ఆమె అనుకుంటున్నారా.. యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై యాంకరింగ్ తో మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ఫుల్ యాంకర్ గా పేరు పొందింది శ్రీముఖి.. ఆమె యాంకరింగ్ లోనే కాకుండా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ సెన్షేషనల్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలు కూడా చేస్తూ తన లైఫ్ ని బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ లెవెల్ లో కొనసాగుతున్న యాంకర్లలో శ్రీముఖికీ యూత్ లో మాత్రం చాలా ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

 

Advertisement

అయితే ఈ అమ్మడు పారితోషికం విషయంలో కూడా సుమకి తగ్గట్టుగా పోటీని ఇస్తోంది. ఈ క్రమంలోనే శ్రీముఖి తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచిందని సమాచారం.. అయితే యాంకర్ సుమ ఒక కాల్ షిటు 5లక్షల రూపాయలు తీసుకుంటే, ఆమె తర్వాతి స్థానంలో ఉన్న శ్రీముఖి మూడు లక్షల వరకు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఆమె తన మాటలతో ఇప్పటికే ఎంతోమందినీ ఆకట్టుకున్నది. ప్రస్తుతం శ్రీముఖి చాలా సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తుంది. కానీ ఈమె నటించిన సినిమాలు అంతగా గుర్తింపు అయితే రాలేదు.

Advertisement

అయితే బుల్లితెర టాప్ యాంకర్లలో మాత్రం సుమా మరియు శ్రీముఖి అనసూయ ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అనసూయ టీవీ షోలలో కంటే సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఈ క్రమంలో టీవీ షో ల విషయానికి వస్తే శ్రీముఖి ఒక రేంజ్ లో పారితోషికాన్ని తీసుకుంటోందని, ముందు ముందు ఈమె ఎంత డిమాండ్ చేస్తుందో అని చాలామంది చర్చించుకుంటున్నారు. వీటితో పాటుగా శ్రీముఖి ఏదైనా మంచి సినిమా ఛాన్సులు వస్తే మాత్రం దశ తిరుగుతుంది కావచ్చు.

also read;

రాజ‌మౌళి సినిమాలో ఐశ్వ‌ర్య‌రాయ్‌..! ఈ క్రేజీ అప్‌డేట్ నిజ‌మేనా..?

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

 

Visitors Are Also Reading