Home » ఎన్టీఆర్: ఒకే ఏడాదిలో వరుసగా హిట్ అయినా మూవీస్.. ఇవేనా..?

ఎన్టీఆర్: ఒకే ఏడాదిలో వరుసగా హిట్ అయినా మూవీస్.. ఇవేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

1956లో నటసార్వభౌముడు కళావైభవం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తీసిన సినిమాలు చాలా హిట్ అయ్యాయి. అలాంటి విజయాలను ఆ సంవత్సరంలో సొంతం చేసుకున్నారాయన. ఇంతకీ ఆ ఏడాదిలో ఆయన చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.తెనాలి రామకృష్ణ : మొదటిగా సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు తమిళ భాషల్లో తెనాలి రామకృష్ణ సినిమా తో వచ్చారు ఎన్టీఆర్. తెలుగులో రామకృష్ణుడి గా ఏఎన్ఆర్ చేశారు. కృష్ణదేవరాయలు గా రెండు భాషలో ఎన్టీఆర్ చేశారు. ఆ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు.చింతామణి: ఆ ఏడాది రెండో సినిమాగా ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ చింతామణి. తెలుగువారికి ఎంతో ప్రీతికరమైన చింతామణి నాటకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ బిల్వమంగళుడు గా, రేలంగి సుబ్బిశెట్టి గా, భానుమతి చింతామణి గా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించగా యావరేజ్ గా ఆకట్టుకుందిజయం మనదే: తెలుగు జానపదాలు అంటే ఎన్టీఆరే అన్నట్లు మరోమారు నిరూపించుకున్నారు. దుర్మార్గమైన మంత్రి ఆ రాజ్యంలో ఉండే సాధారణ పౌరుడు ఎలా ఎదురుతిరిగి గెలిచాడు అని ఆద్యంతం ఆకట్టుకునేలా దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిందిసొంత ఊరు : ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కి మంచి విజయాన్ని ఇచ్చింది. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా లో ఎన్టీఆర్, షావుకారు జానకి ప్రధాన పాత్రలో నటించారు.
ఉమా సుందరి : ఓ మహారాజు చెల్లెలైనా ఉమాసుందరి ని పెళ్లాడిన ఎన్టీఆర్ ఎలాంటి కష్టాలు పడ్డాడో అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.చిరంజీవులు: ఈ సినిమా ఎన్టీఆర్ కు మళ్ళీ ఘన విజయాన్ని అందించింది. ఇందులో అంధుడిగా ఎన్టీఆర్ కొద్దిసేపు తన పాత్రకు ప్రాణం పోశాడు.శ్రీ గౌరీ మహత్యం : కత్తియుద్ధాల్లో ఎన్టీఆర్ మరోమారు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతో. ఎన్టీఆర్ ఈ సినిమాతో మరోసారి మంచి విజయాన్ని దక్కించుకున్నారు.పెంకి పెళ్ళాం: ఈ సినిమాను కమలాకర్ కామేశ్వరరావు డైరెక్టు చేశారు. ఎన్టీఆర్ తన భార్యతో ఎలాంటి పాట్లు పడ్డాడో అలాగే చివరికి ఆమెను ఎలా ఒక మార్పుకు తీసుకుని వచ్చాడు అనేది ఆకట్టుకుంటుంది.చరణదాసి : ఈ సినిమాతో హిట్ మీద హిట్ అందుకొని ఈ సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ తో పాటు ఏఎన్ఆర్ కూడా నటించారు. తమ భార్యల మొహాలు కూడా చూడడానికి ఇష్టపడని హీరోలు, తర్వాత వారి జీవితంలో వచ్చే మార్పులు ఎలా కొత్తగా ఉన్నాయి, వారిలో ఎలా మార్పు తీసుకు వచ్చాయి అనే ఎంటర్టైన్మెంట్ తో కొనసాగుతోంది. ఇలా ఆ ఏడాదిలో ఎన్టీఆర్ ఒక్క ఫ్లాప్ అనేది కూడా చూడకుండా ఏడు హిట్లు అందుకొని ఇండస్ట్రీని కనకమయం చేశారు.

Advertisement

ALSO READ;

Advertisement

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

చిరంజీవి వ‌ల్లే సీఎం ఛాన్స్ మిస్‌.. చంద్ర‌బాబు సంచల‌న వ్యాఖ్య‌లు..!

 

Visitors Are Also Reading