Home » ఉత్తమ నటి అవార్డు విషయంలో భానుమతి, సావిత్రి మధ్య వివాదం అంతలా తలెత్తిందా ?

ఉత్తమ నటి అవార్డు విషయంలో భానుమతి, సావిత్రి మధ్య వివాదం అంతలా తలెత్తిందా ?

by Anji
Ad

సాధారణంగా సినీ రంగంలో అవార్డుల విషయంలో ఒక్కోసారి వివాదాలు ఏర్పడుతుంటాయి.  అవి మనం కొన్ని సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. అది చాలా కాలం కొనసాగుతుంది. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డులను ప్రకటన చేసినప్పుడు వివిధ రాష్ట్రాలలోని పలువురు హీరోల అభిమానులు, సన్నిహితులు అసంతృప్తి  వ్యక్తం చేశారు. అంతేకాదు.. అవార్డులు రానీ కొన్ని భాషల నటులు టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నంది అవార్డుల విషయంలో కూడా టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

Advertisement

అవార్డుల విషయంలో వివాదాలు ఏర్పడటం కొత్త ఏమి కాదు. 1950లో ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో మద్రాస్ లో ఓ సంఘం ఉండేది. ప్రతీ ఏటా ఆ సంఘం అవార్డులను అందించేది. ఒక సంవత్సరం అవార్డులను ప్రకటించిన తరువాత ఉత్తమ నటి అవార్డు విషయంలో వివాదం తలెత్తింది. 1953లో సెన్సార్ అయిన తెలుగు, తమిళ భాష చిత్రాలను పోటీ పంపారు. అందులో దేవదాస్, చండీరాణి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నింటినీ చూశారు న్యాయ నిర్ణేతలు. తెలుగులో ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు (దేవదాస్), ఉత్తమనటిగా భానుమతి (చండీరాణి)కి ఎంపికైనట్టు ప్రకటించారు. తమిళంలో సావిత్రిని (దేవదాస్) కి ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకున్నాయి.

Advertisement

 

రెండు భాషల్లో ఒకే సినిమా నిర్మాణం జరుపుకున్నప్పుడు తమిళంలో మాత్రమే సావిత్రికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడమేంటి..? తెలుగులో కూడా ఇవ్వాలిగా.. భానుమతికి తెలుగులో మాత్రమే ఇవ్వడం ఏంటి..? తమిళంలో కూడా ఇవ్వాలిగా.. ఒకే అవార్డును ఇద్దరికీ ఎలా ఇవ్వాలనే ఉద్దేశంతోనే అవార్డులను ఇద్దరికీ పంచారా..? అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఉత్తమ నటిగా సావిత్రి అవార్డును అందుకున్నారు. కానీ చండీరాణి సినిమాకి ఉత్తమ నటి అవార్డును అందుకునేందుకు భానుమతి ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం.

 

Also Read :  రజినీ మూవీ ఒకే థియేటర్ లో 890 రోజులు ఆడింది.. చిరంజీవికి అది బ్యాడ్ లక్..!

Visitors Are Also Reading