Home » రజినీ మూవీ ఒకే థియేటర్ లో 890 రోజులు ఆడింది.. చిరంజీవికి అది బ్యాడ్ లక్..!

రజినీ మూవీ ఒకే థియేటర్ లో 890 రోజులు ఆడింది.. చిరంజీవికి అది బ్యాడ్ లక్..!

by Anji
Ad

సాధారణంగా సినీ రంగంలో కొన్ని సినిమాలు అకస్మాత్తుగా సెట్ అవుతాయి. అలా సెట్ అయిన సినిమాలు కొన్ని రికార్డు సృష్టించాయి కూడా. తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన రజినీకాంత్ మూవీ చంద్రముఖీ. ఈ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ప్రారంభం కావడానికి ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. వాస్తవానికి 2004లో కన్నడలో విడుదలైన ఆప్తమిత్ర సినిమాని ఎవ్వరూ గుర్తు పట్టకుండా రజినీకాంత్ వృద్ధుడి గెటప్ లో వెళ్లి ప్రేక్షకుల్లో కలిసి చూశాడు. 

rajini-and-chiru

Advertisement

 

ఆ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ చిత్రానికి తప్పకుండా తమిళంలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కే.ఎస్. రవికుమార్ తో జగ్గుబాయ్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ ఆప్తమిత్ర రీమేక్ చేయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడు. దర్శకుడు పి.వాసు, శివాజీ గణేశన్ తనయుడు ప్రభుకి ఫోన్ చేసి మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. దానికి పి.వాసు మరీ జగ్గుబాయ్ అన్నాడు.. అది క్యాన్సిల్.. ఈ సినిమా నే రీమేక్ చేస్తున్నామని చెప్పాడు. పి.వాసు కి రజినీ ఒక్క మాటనే చెప్పాడు. మణిచిత్రతాళ్లు, ఆప్తమిత్ర కంటే ఈ సినిమా సూపర్ హిట్ కావాలి.. 1993లో మణిచిత్రతాళ్లు వచ్చింది. దానిని కన్నడలో పి.వాసు ఆప్తమిత్ర గా రీమేక్ చేశాడు. ఇప్పుడు అదే సినిమాని తమిళంలో రీమేక్ చేసే బాధ్యత ను కూడా పి.వాసుకే అప్పగించాడు రజినీ.

Advertisement

 

ఆప్తమిత్రలో హీరో విష్ణు వర్థన్ హౌలా.. హౌలా అంటూ ఓ పదాన్ని వాడతాడు. అది రజినీకాంత్ కి నచ్చలేదు. దానిని మార్చాలని.. చిన్నతనంలో ఓ మరాఠి నాటకంలో విలన్ లకలకలక అనడం రజినీకి గుర్తుంది. దానినే సినిమాలో పెట్టాలనుకున్నాడు. అలాగే టైటిట్ నాగవల్లి అని పెట్టాలనుకున్నారు. కానీ రజినీకి నచ్చలేదు. రాజుల కాలం నాటి నర్తకి కాబట్టి హెవీగా ఉండాలని సూచించారు. అందరూ కలిసి చంద్రముఖి అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఈ సినిమాలో నయనతార ఓకే అయింది. చంద్రముఖి క్యారెక్టర్ ని స్నేహ, రిమాసేన్ లను అనుకున్నారు. కానీ సిమ్రాన్ ఫైనల్ చేశారు. రెండు రోజులు షూటింగ్ కూడా జరిగింది. అదే సమయంలో సిమ్రాన్ ప్రెగ్నెంట్ కావడంతో సినిమాని వదులుకుంది. ఆ క్యారెక్టర్ లో జ్యోతిక కు దక్కింది. ఈ సినిమాకి రూ.19కోట్లు ఖర్చు అయింది.

2005 ఏప్రిల్ 14న చంద్రముఖి తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.45 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తం రూ.75 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. తమిళనాడులో చాలా కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. చెన్నైలోని శాంతి థియేటర్ లో ఏకంగా 890 రోజులు నిరంతరాయంగా ప్రదర్శింపబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకి సంబంధించి మరో విషయం ఏంటంటే..? 1993లో విడుదలై ఘన విజయం సాధించిన మణి చిత్రతాళు డీవీడీ చిరంజీవికి ఇచ్చి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పాడు దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య. చిరంజీవి ఈ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించలేదు. చంద్రముఖీ విడుదలైన తరువాత వీ.ఎన్.ఆదిత్యకి చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి సినిమా పై అతనికీ ఉన్న జడ్జీమెంట్ ను మెచ్చుకున్నారు. 

Also Read :  ఒకే కథతో ఒకే రోజు రెండు సినిమాలు.. ఎన్టీఆర్ కి ఎదురెళ్లి మరీ నష్టపోయిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading