Home » రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా పెంచాడా..?

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు రెమ్యునరేషన్ భారీగా పెంచాడా..?

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీలో టాప్ హీరోగానే కొనసాగుతున్నాడు. తండ్రి కృష్ణకి ఏ మాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నాడు మహేష్ బాబు.   ఇటీవలే సర్కారు వారి పాట మూవీ తరువాత గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. 

Advertisement

త్రివిక్రమ్ తో చేసే గుంటూరు కారం మూవీ పూర్తి కాగానే మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషనల్ మరో సినిమా చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ ఆషక్తికరమైన విషయం చర్చనీయాంశమైంది. అయితే త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం మూవీ కోసం రూ.70కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట మహేష్ బాబు. అయితే రాజమౌళి సినిమా కోసం రూ.110 కోట్లు తీసుకుంటానని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నాడట.

Advertisement

అయితే ఈ సినిమా మహేష్ బాబు తన రెమ్యునరేషన్ ని విపరీతంగా పెంచేశాడు. పైగా ఇది రాజమౌళి సినిమా కావడంతో ఈ రేంజ్ లో కచ్చితంగా రెమ్యునరేషన్ తీసుకోవాలని కూడా మహేష్ బాబు అనుకున్నారట.  ఈ చిత్రానికి సంబంధించిన రెమ్యునరేషన్ కి కూడా చిత్రబృందం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మహేష్ బాబు-జక్కన్న కాంబోలో తెరకెక్కే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందట.  ఈ సినిమా గురించి ఊహించడమే పెద్ద కష్టం అనే చెప్పవచ్చు.  మొత్తానికీ రాజమౌళి సినిమాతో మహేష్ బాబు సినీ కెరీర్ మారిపోతుందని స్పష్టమవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మహేష్ బాబు – రేణు దేశాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా ?

కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల వాయిదా.. మళ్లీ అప్పుడేనా..?

Visitors Are Also Reading