Home » మహేష్ బాబు – రేణు దేశాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా ?

మహేష్ బాబు – రేణు దేశాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా రేణు దేశాయ్  ఎంతటి  పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో నటించింది.  జానీ తరువాత తన సినీ కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టేసింది.  సోషల్ మీడియా లో కూడా ఈమె తరచూ యాక్టీవ్ గానే ఉంటుంది. 

పూణే నుంచి మోడల్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న రేణు దేశాయ్, ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆడిషన్స్ ద్వారా ఈమెని బద్రి సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడు.అలా పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడి, అతనితో ప్రేమలో పడిపోయింది.

Advertisement

mahesh-and-renudesai Movies

mahesh-and-renudesai Movies

 

కొంత కాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు విబేధాలు వచ్చి విడిపోయారు. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆయన నటించిన పలు సినిమాలకు పని చేసింది రేణు దేశాయ్. చాలా కాలం తర్వాత ఆమె లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్య పాత్ర ద్వారా  ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Advertisement

ఈ సినిమా ఈ నెల 20న  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉంటే రేణు దేశాయ్ కి ‘బద్రి’ చిత్రం తర్వాత చాలానే  అవకాశాలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన తర్వాత ఇక నటించకూడదు అని ఫిక్స్ అయిపోయిందట. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే ఛాన్స్ కూడా వదులుకుంది. మహేష్ బాబు కెరీర్ లోనే మురారీ మూవీకి  ఎంత ప్రత్యేకత ఉందో దాదాపు అందరికీ తెలిసిందే. 

తన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ..  మురారి చిత్రం కి ఉన్న ప్రత్యేకతనే  వేరు. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా రేణు దేశాయ్ ని సంప్రదించారట దర్శకుడు కృష్ణవంశీ. అయితే  ఆమెకి మనసులో చేయాలని.. ఉన్నప్పటికీ కూడా సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకుందట. 

ఆ తర్వాత హిందీ నుండి సోనాలి బింద్రే ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. కేవలం ఈ చిత్రం మాత్రమే కాదు, ఎన్నో మంచి అవకాశాలను ఆమె అప్పట్లో వదులుకుందట.ఒకవేళ రేణు దేశాయ్ అలాగే హీరోయిన్ గా కొనసాగి ఉంటే ఈరోజు ఆమె రేంజ్ మరోలా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.ఇక నుంచి ఆమె సినీ  కెరీర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరీ. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టైగర్ 3 ట్రైలర్ వచ్చేసింది.. దేశం కోసం దివాళికి..!

శుభలగ్నం సినిమాలో భర్తని భార్య అమ్ముకునే కాన్సెప్ట్ ఏ రైటర్ చెప్పాడో తెలుసా ?

 

Visitors Are Also Reading