ఓ వృద్ధుడు తన భార్య మృతి చెందిందని అసలు జీర్ణించుకోలేకపోయారు. తన ప్రేమ శాశ్వతం అంటూ భార్య మృతదేహంతో దాదాపు 21 ఏళ్లు జీవించాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30న తన భార్యకు చివరి వీడ్కోలు పలికాడు. భార్య మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈ షాకింగ్ ఘటన థాయిలాండ్‌లో వెలుగులోకి వచ్చింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన విశ్రాంత సైనికాధికారి చార్న్ జన్వాచకల్ భార్య అనారోగ్యంతో 20 ఏళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి భార్య మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంటిలోనే భద్రంగా దాచుకున్నాడు.
Advertisement
రోజు అతను తన భార్య మృతదేహంతో మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు జన్వాచకల్ వయస్సు 72 ఏళ్లు.. దీంతో తన భార్య మృతదేహాన్ని భదద్రపరచలేని భావించిన అతను చివరికి అంత్యక్రియలు నిర్వహించాడు. భార్య దహన సంస్కారాలు చేయడానికి ఫెట్ కాసెమ్ బ్యాంకాకు ఫౌండేషన్ నుంచి సాయం తీసుకుని కర్మకాండ పూర్తి చేశాడు. ఇక అంతటితో ఆగలేదు. చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు. తాను బతికి ఉన్నంత వరకు అది తనతోనే ఉంటుందని పేర్కొంటున్నాడు. ఈ దహన సంస్కారాల ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
ఈ విషయం తెలుసుకున్న తరువాత ఓ న్యాయవాది జన్వాచకల్ ను సందర్శించి ఇంటర్వ్యూ చేశాడు. అతను తన భార్య, ఇద్దరూ కుమారులతో కలిసి జీవించేవాడని అయితే ఆమె మరణించినప్పుడు ఆమె మృతదేహాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారని న్యాయవాది పేర్కొన్నారు. చార్న్ జన్వాచకల్ రాయల్ థాయ్ ఆర్మీలో వైద్యునిగా విధుల నిర్వహించడానికి ముందు.. యూనివర్సిటీలో ఫార్మసీ ఫ్యాకల్టీగా పని చేసేవారట. ఇక అతని భార్య ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలో పని చేసినట్టు వివరించారు.
Also Read :
క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోండి
ట్విట్టర్ డీల్ హోల్డ్ అంటున్న ఎలన్ మస్క్..!