Home » ట్విట్ట‌ర్ డీల్ హోల్డ్ అంటున్న ఎల‌న్ మ‌స్క్‌..!

ట్విట్ట‌ర్ డీల్ హోల్డ్ అంటున్న ఎల‌న్ మ‌స్క్‌..!

by Anji
Ad

ఇటీవ‌ల ట్విట్ట‌ర్ డీల్ ప్ర‌పంచం మొత్తాన్ని షేక్ షేక్ చేసిన సంగ‌తి విధిత‌మే. ప్ర‌పంచ కుబేరుడు ఎల‌న్ మ‌స్క్ కామెడిగా ట్విట్ట‌ర్‌ను కొనేశారు అని తేలిన విష‌యం ప్ర‌పంచానికి షాక్ కే గురి చేసింది. ట్విట్ట‌ర్ డీల్ తాత్కాలికంగా ఆపివేసిన‌ట్టు ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. 44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్‌కు కొనుగోలు చేసేందుకే మ‌స్క్‌డీల్ చేసుకున్నారు. స్పామ్‌, ఫేక్ ఖాతాల వివ‌రాలు త‌మ‌కు తెలియాల‌ని కోరాడు. అలాంటి ఖాతాలు 5 శాతం లోపాలే ఉన్న‌ట్టు ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం వెల్ల‌డించింది.

Advertisement

ట్విట్ట‌ర్‌లో తొలుత 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన మ‌స్క్ త‌రువాత సంస్థ మొత్తాన్ని కొనేసి సంగ‌తి తెలిసిందే. దాదాపు 44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ఒప్పందం కుదిరింది. ఒక్కో షేర్ 54.20 డాల‌ర్ల చొప్పున మొత్తం 46.5 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధం అని మ‌స్క్ ప్ర‌క‌టించారు. ఈ డీల్‌కు తాత్కాలికంగా బ్రేకు ప‌డింద‌ని మ‌స్క్ ట్వీట్ చేసాడు. స్పామ్‌, న‌కిలీ ఖాతాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. వాస్త‌వాని క‌న్నా 5 శాతం కంటే త‌క్కువ యూజ‌ర్ల‌ను సూచిస్తున్నాయ‌ని ట్విట్ట‌ర్ యూజ‌ర్ల లెక్క‌కు మ‌ద్ద‌తునిచ్చే వివ‌రాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆయ‌న ట్వీట్ చేసారు.

Advertisement


స్పామ్ బాట్స్‌ని తొల‌గించ‌డ‌మే త‌న ప్రాధాన్య‌త‌లో ఒక‌టి అని అన్నారు. ఎల‌న్ మ‌స్క్ ట్వీట్‌తో ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్ట‌ర్ షేర్లు 20 శాతం ప‌త‌న‌మ‌య్యాయి. దీనిపై ట్విట్ట‌ర్‌ను స్పందించాల్సి ఉంది. ఎల‌న్ మ‌స్క్ తొలుత ట్విట్ట‌ర్ లో 9 శాతం వాటాలు కొన్న‌ట్టు ఏప్రిల్ 4న ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్‌లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ త‌రువాత 44 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ డీల్ హోల్డ్‌లో ఉన్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం అయింది.

Also Read : 

క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు ఈ జాగ్ర‌త్త‌ త‌ప్ప‌కుండా తీసుకోండి

ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు విడుద‌లైన హీరోలు వీరే..!

 

Visitors Are Also Reading