Home » నటి సుజాత జీవితంలో పడిన ఇబ్బందుల గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండరు..!

నటి సుజాత జీవితంలో పడిన ఇబ్బందుల గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండరు..!

by Anji
Ad

అలనాటి సినిమాల్లో కథానాయికగా నటించిన సీనియర్ నటి సుజాత గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. పాతతరం అగ్రకథానాయకుల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించిన నటి సుజాత హిందీ చిత్రాలలో కూడా నటించారు. తెలుగు చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు ఆమె జీవితాంతం కన్నీటితోనే కాపురం చేశారు. ఆమె జీవితంలో తన భర్త వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె నిజ జీవితానికి సంబంధించిన పరిస్థితుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

సుజాత మలయాళ నటి.. ఆమె శ్రీలంకలోని గల్లెలో జన్మించారు. తన తండ్రి ఉద్యోగరిత్యా ఆమె బాల్యం శ్రీలంకలోనే గడిచింది. హై స్కూల్ చదువు పూర్తి కాగానే ఎముకులమ్ జంక్షన్ అనే మలయాళ సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ తరువాత కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన అవల్ ఒరు తోడర్ కథై మూవీలో ప్రధాన పాత్రలో నటించారు. సుజాత నటించిన ఫస్ట్ తమిళ మూవీ ఇదే. తెలుగులో ఈ సినిమా అంతులేని కథగా విడుదలైంది. బాలచందర్ ఆధ్వర్యంలో వచ్చిన మరో చిత్రం అవర్గల్ సుజాతకి మంచి పేరు తెచ్చిపెట్టింది. గోరింటాకు సినిమాతో దాసరి నారాయణరావు సుజాతను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తెలుగులో ఆమె నటించిన ఫస్ట్ మూవీ అప్పట్లో సూపర్ హిట్ సాధించింది. 

Advertisement

 

దాసరి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్ రావు, సీనియర్ ఎన్టీఆర్, కృష్ణంరాజు, కృష్ణ హీరోలతో పలు సినిమాల్లో నటించారు. పండంటి జీవితం, రగిలే జ్వాల, గుప్పెడు మనస్సు, ప్రేమ తరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రదారులు తదితర సినిమాల్లో కీలక పాత్రను పోషించారు. చంటి మూవీలో హీరో వెంకటేష్ కి.. పెళ్లి మూవీలో పృథ్వీకి తల్లిగా నటించారు సుజాత. జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సుజాత. పెళ్లి చేసుకున్న సమయంలో పచ్చళ్ల బిజినెస్ చేసేవాడు. అతని బిజినెస్ అంతగా సాగకపోవడంతో సుజాత సంపాదనపై ఆధారపడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

జయశంకర్ తన వ్యాపారాన్ని బంద్ చేసుకొని సుజాతతో మూవీ షూటింగ్ లకు వెళ్లేవాడు. షూటింగ్ జరిగే సమయంలో సుజాత ఎవ్వరితోనైనా మాట్లాడినట్టు కనిపిస్తే చాలు.. అనుమానపడేవాడు. షూటింగ్ తరువాత ఇంటికి చేరుకున్నాక మానసికంగా.. శారీరకంగా హింసించేవాడట. దీంతో ఆమె షూటింగ్ సమయంలో ఎవ్వరితో కూడా ఎక్కువగా మాట్లాడేది కాదు. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ పిల్లల చదువుపై మాత్రం చాలా శ్రద్ధ తీసుకునేవారు సుజాత. తన అనుమానం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుందట. మంచి అవకాశాలు వచ్చే సమయంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. 2011 ఏప్రిల్ 06న చెన్నైలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే జీవితాంతం కష్టాలను అనుభవించింది సుజాత. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ కల్కి మూవీ వాయిదా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ 

 రీమేక్ మూవీస్ గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading