Telugu News » Blog » Happy New Year 2023: Wishes, Images for Whatsapp status Telugu..!

Happy New Year 2023: Wishes, Images for Whatsapp status Telugu..!

by Sravanthi Pandrala Pandrala
Ads

Happy New Year 2023: Wishes, Images for Whatsapp status Telugu: మీరు కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పడానికి ఎంతో సమయం కూడా లేదు.. 2022 కు స్వస్తి పలికి 2023 నూతన సంవత్సరం కోసం చాలామంది కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. పాత సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, నూతన సంవత్సరంలో కొత్త లక్ష్యాలకు సిద్ధమవుతూ 2023 లో అడుగు పెట్టేందుకు అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Advertisement

ఈ కొత్త సంవత్సరంలో మీ బంధుమిత్రులు, స్నేహితులు పంపే శుభాకాంక్షలు సందేశాలు
చదువుతూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం కోసం ఎదురు చూసే మీ అందరి కోసం సరికొత్త న్యూ ఇయర్ విషెస్ ఈ విధంగా తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు వాట్సాప్, ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ సందేశాలు పంపించి నూతన సంవత్సరంలో వారిని ఆనందపరిచేలా విషెస్ చెప్పండి ..

1. ఎన్నో ఆశలను మోసుకొస్తున్నటువంటి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మీ కుటుంబ సభ్యులకు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

2. మీ అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్ని సరికొత్త ఉత్తైజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలో కాకుండా జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

3.ప్రతి సుమం, సుగంధభరితం,
ఈ కొత్త ఏడాదిలో మీకు ప్రతి నిమిషం ఆనందభరితం కావాలని కోరుకుంటూ..
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్..!

Advertisement

4.చప్పట్లు కొట్టి మనల్ని పొగిడిన మనుషుల్ని మర్చిపోవచ్చు..కానీ, సాయం చేసి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు మిత్రమా..
ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు..!

5. గతంలో చేసిన తప్పులు మర్చిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మారిపో..

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 

6. కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా సరే రానీ..
సవాళ్లకు ఎదురు నిలిచి
కలిసి నిలుద్దాం, కలబడదాం,విజయం సాధిద్దాం.
హ్యాపీ న్యూ ఇయర్..

7. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు,
సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకంక్షలు.

8. సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ,
కావాలి మీ జీవితాలు వెలుగులు ఈవేళ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

9. ఇప్పటివరకు కరోనాతో ఇబ్బందులు పడ్డాం.. ఇకనుంచి అలాంటివి రాకుండా కొత్తగా ఆలోచిద్దాం. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

10. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ, అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Advertisement

also read:Happy New Year Wishes, Images, Quotes, Greetings, Status in Telugu 2023

You may also like