ప్రస్తుతం చలికాలం కావడంతో రోజురోజుకు చలి పెరిగిపోతుంది. తీవ్రమైన చలితో పిల్లలనుంచి పెద్దల వరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రధానంగా చలికాలంలో ఎదురయ్య చర్మ సమస్యల నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైసర్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఇలా ఉండగా చలికాలంలో వెంట్రుకలు రాలిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.
Advertisement
ఇంతకుముందు చెప్పినట్లుగా చలికాలంలో బయటి వాతావరణం పొడిగాలితో నిండి ఉండి స్కాల్ప్ నుంచి సహజ నూనె, తేమను తొలగిస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు నూనెతో తలకు, జుట్టుకు బాగా మసాజ్ చేయాలి. ఆయిల్ మసాజ్ లు స్కాల్ కి రక్తప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. జుట్టు కుదుళ్ళను లోపలి నుంచి బలోపేతం చేస్తాయి. జుట్టుకు సరిపోయే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెలను ఎంచుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ గోరువెచ్చటి నూనెలో వేసి బాగా కలిపి తల నుంచి జుట్టు మొదల వరకు బాగా పట్టించడం ద్వారా వెంట్రుకలు రాలకుండా చూసుకోవచ్చు.
Advertisement
మనం తినే పేలవమైన ఆహారం మన చర్మం పైన కాకుండా జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది జుట్టు విరిగిపోవడానికి, రాలడానికి దారితీస్తుంది. అందువల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వుతో కూడిన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం ఆహారంలో సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం మరిచిపోవద్దు. చలి, పొడి గాలులతో కూడిన సీజన్ లో కూడా వేసవిలో మాదిరిగా తగినంత నీరు త్రాగాలి. శరీరంలో హైడ్రేటెడ్ గా ఉండాల్సిన మేజిక్ కషాయం నీరు. జుట్టును కూడా హైడ్రేట్ గా ఉంచడానికి తగినంత నీరు త్రాగాలి. నీరు ఎక్కువగా తాగడం అనేది జుట్టు చివర్లు చిట్లిపోకుండా, పేళుసుగా మారకుండా నివారిస్తుంది.
ఇవి కూడా చదవండి : ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త.. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు