Home » ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త.. కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

ఏపీ నిరుద్యోగులకు జగన్ శుభవార్త.. కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

by Bunty
Ad

ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు జగన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.

Advertisement

గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగాలకు డిసెంబర్ 28, ఎస్ఐ పోస్టులకు జనవరి 18 తేదీలతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. తాజా ప్రకటనలతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి ఏడు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎస్సై ఉద్యోగాలకు జనవరి 18 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా బోర్డు సూచించింది.

Advertisement

కాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన 6,511 పోలీస్ ఉద్యోగాలకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదలైంది. ఎస్సై పోస్ట్ లో 411, కానిస్టేబుల్ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.

read also : తెలంగాణలో కొలువుల జాతర.. TSPSC నుంచి మరో 2 జాబ్ నోటిఫికేషన్లు

Visitors Are Also Reading