Home » గుంటూరు కారం సెన్సార్ టాక్ రివ్యూ… సినిమా ఎలా వుంది అంటే..?

గుంటూరు కారం సెన్సార్ టాక్ రివ్యూ… సినిమా ఎలా వుంది అంటే..?

by Sravya
Ad

మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మరో ఎనిమిది రోజుల్లో అనగా జనవరి 12న సినిమా థియేటర్లలోకి రిలీజ్ కాబోతోంది. మహేష్ బాబు సరసన ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డ్ ధర కి అమ్ముడు అయిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ థియేటర్స్ రైట్ కి దాదాపుగా 150 కోట్లకు అమ్ముడయ్యాయి వరల్డ్ వైల్డ్ గా థియాట్రికల్ రైట్స్ 155 కోట్లకి క్లోజ్ అయ్యాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మూవీ మాస్ ప్రేక్షకులను పూనకలు తెప్పించే విధంగా ఉంటుందని మహేష్ బాబు మేనరిజం అదిరిపోయింది అని ఇప్పటికే టాక్ అయితే వచ్చింది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ని జారీ చేసింది.

Advertisement

మహేష్ బాబు జిఎస్టితో కలిపి ఈ సినిమాకి 78 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీని 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసుకు వచ్చారు. ఈ సినిమాని చూస్తున్న సెన్సార్ వాళ్ళు చాలా కాలం తర్వాత మహేష్ బాబు ని పోకిరి తరహాలో చూస్తున్నామని అన్నారు. సర్కారు వారి పాట మూవీలో కూడా మాస్ తరహా పాత్ర పోషించిన మహేష్ బాబు ఇందులో మాత్రం మాస్ ప్రేక్షకులకు కచ్చితంగా పూనకాలు తెప్పించేలా ఉన్నారని చెప్పారు. పైగా ఈ సినిమా సబ్జెక్టు కూడా చాలా కొత్తగా ఉందని మొత్తం మీద ఇది ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు అని అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading