Home » గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్.. మామూలుగా లేదుగా..!

గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్.. మామూలుగా లేదుగా..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు అండ్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్-మహేస్ బాబు కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత ముచ్చటగా మూడో సినిమాగా గుంటూరు కారం తెరకెక్కింది.

Advertisement

దీంతో అంచనాలు అకాశాన్ని తాకుతున్నాయి. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. కానీ టైమ్ ఇవ్వకపోవడంతో.. ఎప్పుడూ ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు ట్రైలర్ విడుదల అయింది. వెయిట్ చేయిస్తే చేయించారు. కానీ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. మహేష్ ఊర మాస్ లుక్, థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ అనే చెప్పవచ్చు. త్రివిక్రమ్ డైలాగ్స్, ఆ కుర్చీని మడతబెట్టి సాంగ్స్ అదిరిపోయాయి. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి మహేష్ రెడి అయినట్టు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథల వదిలేశారు అంటున్నారు అని త్రివిక్రమ్ వాయిస్ తో ట్రైలర్ రిలీజ్ అయింది. అస్సలు సూపర్ అని చెప్పడం చిన్న మాట అవుతుంది అని అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు లుక్, డైలాగ్స్, కామెడీ పంచ్ లు.. నెక్ట్స్ లెవెల్ అనే చె్ాలి. శ్రీలీల అందం ఈ చిత్రానికే హైలెట్. తొలుత నుంచి చెబుతున్నట్టే.. తల్లికొడుకుల అనుబంధాన్ని త్రివిక్రమ్ మరోసారి చూపించనున్నాడు. అత్తారింటికి దారేదిలో అత్తా అల్లుళ్ల మధ్య బంధం ఎలా ఉంటుందో.. ఇందులో తల్లికొడుకుల మధ్య అలా ఉండబోతుందని తెలుస్తోంది. జనవరి 12న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. గుంటూరు కారం మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading