తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదల చేసి అప్లికేషన్లను కూడా ప్రారంభించింది. గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదలైందని మెల్లగా ప్రిపరేషన్ ప్రారంభించిన సమయంలనే వెంటనే గ్రూపు-2 నోటిఫికేషన్ వేసింది. గ్రూపు2 నోటిఫికేషన్ వేసిన మరుసటి రోజే గ్రూపు-3 నోటిఫికేషన్, ఇవే కాకుండా జూనియర్ లెక్చరర్, జైలు వార్డెన్, స్టాప్ నర్సు ఇలా రోజుకో నోటిఫికేషన్ విడుదల చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Advertisement
కొంత మంది నోటిఫికేషన్లను విడుదల చేయకుంటే.. విడుదల చేయడం లేదంటారు. విడుదల చేస్తే ఇలా విడుదల చేస్తున్నారేంటని ఆశ్చర్యానికి గురవుతున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 1365 పోస్టులను గ్రూపు-3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులను స్వీకరించినున్నట్టు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Advertisement
Also Read : అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
గ్రూప్-3 తో పాటు వైద్యారోగ్యశాఖల్లో వివిధ భాగాలలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్యవిధాన పరిషత్ 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్ జే సంస్థలో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో 127, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మా జ్యోతిబాపూలే విద్యాసంస్థలో 197, తెలంగాణ ట్రైబల్ వెల్పేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్పేర్ 124, తెలంగాణ రెసిడెన్షియల్ లో 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.