తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రూపు1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసింది.
Also Read : రేణుకకి డబ్బు ఆశ.. ప్రవీణ్ కి అమ్మాయిల కోరిక.. కీలక అంశాలు వెలుగులోకి !
Advertisement
గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూపు 1 ఎగ్జామ్ ని పేపర్ లీక్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ. సిట్ ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాధారాలు రుజువు అయిన కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.తిరిగి గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 11న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 3.8లక్షల మంది హాజరయ్యారు. అందులో 25వేల మంది మాత్రమే మెయిన్స్ కి అర్హత సాధించారు.
Advertisement
Also Read : కీరవాణి ఆరోజే రిటైర్ అవుతా అన్నాడు కానీ..!
మెయిన్స్ కి అర్హత సాధించిన 25వేల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి అనేది ఆందోళన నెలకొంది. గ్రూపు 1 పరీక్ష రద్దుపై మెయిన్స్ అర్హత సాధించిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చదివే వారికి ఎలాంటి నష్టం జరగదు.. రేపు పరీక్ష పెట్టినా కానీ వారు అందులో ఆటోమెటిక్ గా క్వాలిఫై అవుతాని పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి పేపర్ లీకేజ్ వ్యవహారం అన్ని పరీక్షలకు పెద్ద ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.
Also Read : ‘కబ్జా’ సినిమాపై నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలు!