Home » గ్రూప్ -1 ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అల‌ర్ట్‌గా ఉండండి.. జులై 21 వ‌ర‌కు ఆ ఛాన్స్‌..!

గ్రూప్ -1 ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అల‌ర్ట్‌గా ఉండండి.. జులై 21 వ‌ర‌కు ఆ ఛాన్స్‌..!

by Anji
Ad

గ్రూపు-1 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల ఫామ్‌లో ఏవైనా త‌ప్పులు ఉన్న‌ట్ట‌యితే ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. జులై 19 నుంచి 21 వ‌ర‌కు అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు అని తెలిపింది.గ్రూపు-1 ద‌ర‌ఖాస్తులు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఖాళీల భ‌ర్తీకి ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం విధిత‌మే. ఈ పోస్టుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇక ఉమ్మ‌డి రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఖాళీల‌తో గ్రూపు-1లో నోటిఫికేష‌న్ విడుద‌లైన చ‌రిత్ర లేదు. ప్ర‌త్యేక రాష్ట్రం నాటి నుంచి విడుద‌లైన తొలి నోటిఫికేష‌న్ కావ‌డంతో ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు గ్రూపు-1 ఉద్యోగం సాధించ‌డ‌మే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ త‌రుణంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ను అక్టోబ‌ర్ 16న నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మెయిన్స్ ను జ‌న‌వ‌రి లేదంటే ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొంది.

Advertisement

Advertisement


గ్రూప్‌-1 కి స‌మ‌ర్పిస్తున్న త‌రుణంలో త‌ప్పులు దొర్లాయ‌ని క‌మిష‌న్‌కు కొంత‌మంది ఫోన్‌లు చేయ‌డం మెయిల్స్ చేయ‌డంతో వారి అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ద‌ర‌ఖాస్తులో దొర్లిన త‌ప్పుల‌ను స‌రి చేసుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పించింది. జులై 19 నుంచి 21 వ‌ర‌కు అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ద‌ర‌ఖాస్తులో త‌ప్పులు దొర్లిన‌ట్లు ఎవ‌రికైనా అనిపిస్తే వారు www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. పేరు, పుట్టిన తేదీ, విద్యార్హ‌త‌, ఫోటో, సంత‌కం వంటి వాటిని ఎడిట్ చేసుకోవ‌చ్చు. స‌వ‌ర‌ణ‌ల‌కు త‌గిన ధృవ ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాల‌ని సూచించింది.

Also Read : 

హీరో సుమ‌న్ నీలిచిత్రాల‌ కేసులో ఇరికించింది ఎవ‌రు…? అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఏమి చేసారంటే ?

బాబు మోహ‌న్ ఉంటే ఆ సినిమాలో న‌టించమ‌ని చెప్పిన‌ కోటా, బ్ర‌హ్మానందం..!అలా ఎందుక‌న్నారు.?

 

Visitors Are Also Reading