టీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువయ్యేందుకు ఇప్పుడు సరికొత్త కార్యక్రమాలను చేపడుతుంది. ఎండాకాలం నేపథ్యంలో తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాండ్ లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సదుపాయం కల్పించనుంది. వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎం.డీ. వీసీ సజ్జనార్ ఆదేశించారు.
Advertisement
బస్టాండ్ లలో తాగునీటి సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వేసవిలో ఇబ్బంది పడకుండా ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ లో ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ లోని బస్ బవన్ లో ఆర్.ఎం.లు, డీ.ఎంలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు సజ్జనార్.
Advertisement
Also Read : భీమ్లా నాయక్ చిత్రంలోని ఈ ఫైట్ సీన్ కోసం ఈ టెక్నిక్ వాడారా..?
రాబోయే కాలం టీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకం అని.. ఆ మేరకు అధికారులు అందరూ పూర్తిగా సన్నద్ధం కావాలని సూచించారు. ఎండాాకాలంలో ఆర్టీసీ బస్సులలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలిపించేలా ఫ్యాన్స్, కూలర్స్ లు ఏర్పాటు చేయనున్నారు. వారి దాహార్తి తీర్చేందుకు మంచి నీటి వసతి కూడా కల్పించనున్నారు.
Also Read : ఒకప్పటి నందమూరి హీరో ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?