Home » టీంఇండియాకు కాబోయే కెప్టెన్ అతనే…?

టీంఇండియాకు కాబోయే కెప్టెన్ అతనే…?

by Azhar
Ad

గతా ఏడాది వరకు భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ… ఆ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇప్పుడు టీంఇండియాకు మూడు ఫార్మాట్లలో రోహితే నాయకుడిగా ఉన్నాడు. కానీ ఏజ్, ఫిట్నెస్ దృష్ట్యా చూస్తే… హిట్ మ్యాన్ ఇంకా రెండు, మూడేళ్ళ వరకే ఆ బాధ్యతలను మేయగలడు. దాంతో భారత జట్టుకు తర్వాత కాబోయే కెప్టెన్ ఎవరు అనే చర్చ ఎప్పటి నుండో జరుగుతుండగా… ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు వరకు కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఉండగా.. ఇప్పుడు తాజాగా హార్దిక్ పాండ్య పేరు కూడా వచ్చింది.

Advertisement

ఈ ఐపీఎల్ 2022 లో పాండ్య కెప్టెన్ గా ఉన్న గుజరాత్ జట్టు నాలుగు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. దానికి తోడు ఇప్పుడు పాండ్య బ్యాటింగ్, బౌలింగ్ లో కూడా ఫామ్ లోకి వచ్చాడు. దాంతో టీంఇండియాకు కాబోయే కెప్టెన్ పాండ్యనే అని పశ్చిమ్ బెంగాల్ మంత్రి మనోజ్ తివారి అన్నారు.

Advertisement

తాజాగా ఈ విషయం పై మనోజ్ మాట్లాడుతూ… నేను ఐపీఎల్ లో పాండ్యను బాగా గమనిస్తున్నాను. అతను ఇప్పుడు బ్యాట్ తో అలాగే బాల్ తో మంచి తూచ్ లో ఉన్నాడు. అదే విధంగా అతని కెప్టెన్సీ కూడా బాగుంది. బౌలింగ్ లో అతను చేసే మార్పులు మరియు ఫిల్డ్ సెట్టింగ్ లు కూడా బాగా చేస్తున్నాడు. కాబాట్టి రోహిత్ తర్వాత భారత జట్టును నడిపే సత్తా పాండ్యకే ఉంది అని మనోజ్ అన్నాడు. కానీ టీంఇండియాకు కాబోయే కెప్టెన్ ఎవరు అనేది.. ఈ ఐపీఎల్ తో పటు వచ్చే సీజన్ తో క్లారిటీ వస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్‌లు వీరే..!

బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!

Visitors Are Also Reading