తెలంగాణలో రాష్ట్రంలో 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటనమేరు ఇప్పటివరకు 45,325 పోస్టుల భర్తి చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన విషయం విధితమే. తాజాగా మరో 1663 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్, ఫారెస్ట్, ఫైర్ జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఇంజినీరింగ్ విభాగంలో, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది.
Advertisement
ఇంజినీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ 1238 పోస్టులు, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్అండ్బీ, ఎన్.హెచ్. అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ, ఆర్యూబీఎస్, హెచ్వోడీలో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ హెచ్ఓడీలో 53, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 1663 ఖాళీలతో కలిపి ఇప్పటివరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తికి అనుమతి ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆయా నియామక సంస్థలు విడుదల చేశాయి. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను ఆయా నియామక సంస్థలు విడుదల చేశాయి. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేస్తున్నారు. త్వరలనే ఖాళీల నియమాకాలకు మంజూరు చేయన్నట్టు సమాచారం.
Advertisement
ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు టీ-సాల్ నెట్వర్క్ ఓ శుభవార్త చెప్పింది. ఇంగ్లీషు మీడియానికి సంబంధించిన పాఠ్యాంశాలను సిద్ధం చేసింది. జులై 01 నుంచి అక్టోబర్ 05వ తేదీ వరకు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు చేయాలని నిర్ణయించింది. ఓ ప్రకటనలో టీసాట్ సీఈఓ వివరాలను వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా భర్తీ చేయనున్న గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంగ్లీషు మీడియం అభ్యర్థుల ఇంగ్లీషు భాషలో సుమారు 60 గంటల పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు. జులై 02 నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు టీ-సాట్ విద్య ఛానల్లో అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయి. దీనిని గ్రూపు-1 అభ్యర్థులు వినియోగించుకోగలరు.
Also Read :
Astrology : ఈ రాశుల వారు ఆ విషయాలను దాస్తారు.. ఆన్లైన్లో తమ ప్రేమను వెతుక్కుంటారు..!